*భాజపా రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మంగళవారం తిరువూరులో పర్యటించారు. భాజపా నాయకులూ, కార్యకర్తలతో సమవేశం అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టవంతం చేయడం పై సమాలోచనలు జరిపారు, పార్టీ నాయకులు సగ్గుర్తి శ్రీనివాసరావు, మాధవరావు, అన్నవరపు క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
* విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
దండెం మీద టవల్ ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని ఎరుకోపాడులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి కిరణ్ (35) కుటుంబ సమేతంగా కొంత కాలం క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లి మెస్ నిర్వహించాడు. 20 రోజుల క్రితమే గ్రామానికి చేరుకుని తనకు ఉన్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని పంటల సాగుకు ఉపక్రమించాడు. పొలం పనులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన కిరణ్ స్నానం చేసిన అనంతరం తడిచిన టవల్‌ను ఇనుప తీగతో కట్టిన దండెం మీద ఆరవేయబోయాడు. పక్కనే ఉన్న కరెంట్ వైరు జాయింట్ దండేనికి అనుకుని ఉండటంతో విద్యుత్తు ప్రసరణ జరుగుతున్న విషయం గమనించక ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
* సేవా దృక్పథంతో పనిచేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ, పశువైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని జేడీ డాక్టర్ భరత్రమేశ్ సూచించారు. వనం- మనంలో భాగంగా స్థానిక పశు వైద్యశాలలో సోమవారం ఆయన సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో పచ్చదనం పెంపొందించడానికి విధిగా మొక్కలు నాటాలని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఆయన నియోజకవర్గం పరిధిలోని వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పశువులు, జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. పశుగ్రాస క్షేత్రాలను సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు వీలుగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ కోటగిరి రామారావు, పశువైద్యులు డాక్టర్ అభిలాష్, డాక్టర్ శ్వేత, డాక్టర్ కె.స్వప్న, డాక్టర్ ఉదయ్, డాక్టర్ సాయికృష్ణ, ఏపీఎన్జీవో అసోసియేషన్ తాలుకా యూనిట్ అధ్యక్షుడు మిరియాల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
* ణాళికతోనే ఉత్తమ ఫలితాలు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సరైన ప్రణాళికతో ఇప్పటి నుంచే బోధన కొనసాగించాలని డీఈవో రాజ్యలక్ష్మి ఉపాధ్యాయినులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సోమవారం ఆమె సందర్శించారు. వీసీఆర్ రూంలో విద్యార్థినులతో కలిసి చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించారు. అనంతరం ఆమె ఉపాధ్యాయినులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్నేళ్లుగా వచ్చిన ఫలితాలను సమీక్షించుకుంటూ మరింత మెరుగైన ఉత్తర్ణీత సాధించడంపై దృష్టిసారించాలని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థినుల విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ, ప్రత్యేకంగా బోధించాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని శ్రీచైతన్య పాఠశాలలో తనిఖీలు చేశారు. తరగతులు నిర్వహిస్తున్న ఈ భవనంలో భద్రత కొరవడినందున క్రీడా మైదానం, సైకిల్ స్టాండ్, విద్యార్థుల అవసరాల మేరకు మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి వసతులున్న భవనంలోకి మార్చాలని ఆదేశించారు. తక్షణమే మార్చాలని, లేనిపక్షంలో గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఈవో రవిసాగర్, ఎంఈవో సోమశేఖర్‌నాయక్, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు జె.రంగారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
* చంద్రయాన్-2లో నేను సైతం-శాస్త్రవేత్త జాన్‌కుమార్
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా సోమవారం చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో తానూ భాగస్వామిని కావటం సంతోషాన్నిస్తోందని మండలంలోని కొండపర్వకు చెందిన ఇస్రో శాస్త్రవేత్త మిద్దే జాన్‌కుమార్ తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ ఆర్కేఏలు కలిపి సంయుక్తంగా భారత్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ చేపట్టాయన్నారు. రూ.425 కోట్లతో ముందుగా అంచనాలు వేసినా, పూర్తయ్యేనాటికి రూ.978 కోట్లకు చేరిందన్నారు. చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటిజాడలను గుర్తించి, చరిత్ర సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా చంద్రయాన్-2 ద్వారా అంతరిక్షంలోకి పంపిన పరికరాలు చంద్రునిపై ఉన్న మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, అక్కడే రసాయన విశ్లేషణ చేసి, ఫలితాలను భూమికి చేరవేయనున్నాయని వెల్లడించారు. ఐదు పరికరాలతో కూడిన ఆర్బిటర్, ల్యాండర్, రెండు పరికరాలతో కూడిన రోవర్, ఆర్బిటర్ పేలోడ్ తదితరాలను పంపామన్నారు. చంద్రునిపై కనీసం పదిమీటర్ల లోతులో నీరు, మంచు ఉనికిని రాబట్టే ఐఆర్ స్పెక్ట్రోమీటర్‌ను, టెరైన్ మ్యాపింగ్, చంద్రునిలోని ఖనిజాలు, ఉపరితలాన్ని త్రీడీలో చిత్రీకరించే కెమెరా తదితరాలను అహ్మదాబాద్‌లోని ఎస్ఏసీ అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకొచ్చామన్నారు. తిరువనంతపురంలోని ఎస్పీఎల్ పరిశోధనా సంస్థ చంద్రుని వాతావరణాన్ని అధ్యయనం చేసే న్యూట్రల్ మాస్ మీటర్‌ను సమకూర్చిందన్నారు. వీటితోపాటు మరిన్ని పరికరాలను చంద్రునిపైకి పంపడం ద్వారా చంద్రునికి మరింత చేరువైనందుకు సంతోషంగా ఉందని ఆయన వివరించారు.
*చంద్రయాన్ 2 వీక్షణం
గంపలగూడెం మండలంలోని పలు జడ్పీ ఉన్నత పాటశాలల్లో సోమవరం ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించిన చంద్రయాన్ ప్రయోగాన్ని విద్యార్ధులకు టీవీల స్వారా చూపించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి విద్యార్ధులని టీవీ ఉన్న తరగతి గదికి ఆహ్వానించి ప్రయోగాన్ని తిలకించేందుకు అవకాశం కల్పించారు. ఉపాద్యాయులు చంద్రయాన్ విశిస్తతను ప్రయోగ ఫలితాలను విద్యార్ధులకు వివరించారు. తిరువూరులో చంద్రయాన్ విజయవంతం అయిన సందర్భంగా మండలం లోని వామకుంట్ల మండల పరిషత్ ప్రాధమికోన్నత పాటశాల విద్యార్ధులు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ, గ్రామ ప్రధాన వేదుల్లో విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు.
*రాష్ట్ర స్థాయి ఖోఖోలో విద్యార్ధుల ప్రతిభ
కర్నూలులో ఈనెల పదిహేడవ తేదీ నుంచి 21వరకు ఏపీ యువజనోత్సవాలు స్థానిక శ్రీవాహిని కళశాలల విద్యార్ధులు తమ ప్రతిభను కనబరిచారు. చివరీ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రధమ స్థానం కైవసం చేసుకుని విజేతలుగా నిలిచారు.
*పంటల బీమా పధకం పై అవగాహనా
వైఎసార్ పంటల బీమా పధకం రైతులకు గొప్ప వరం అని ఏవో ఎస్కే టిప్పూ సుల్తాన్ అన్నారు. ఎ.కొండూరు మండలం లోని వల్లంపట్లలో సోమవరం వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో రైతులకు వైఎసార్ పంటల బీమాపై అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ పధకంలో భాగంగా రైతులు నామమాత్రంగా కెవ;అం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలని, మిగతా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చేల్లిస్తుందన్నారు.
*యువతలో ఆద్యతిమిక చింతన అవసరం
నేటి యువతలో ఆద్యాత్మిక చింతన పెమ్పొందించాల్సిన అవసరం ఉందని బట్టగాని శాంతకుమారి మెమోరియల్ ట్రస్టు నిర్వాహకుడు బీ. కమలాకరరావుఅన్నారు. తమ సంస్థ గ్లోబల్ తెలుగు పస్తర్స్ అసోసియేషన్ తో కలిసి సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన బైబిల్ పోటీల విజేతలకు సోమవారం బహుమతులు పంపిణీ చేశారు.
*న్యాయం చేయాలనీ వినతి
జిల్లాలో డీ ఈవో పూల్ లో ఉన్న ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ కమీషనర్ సంద్యారాణికి సోమవారం వినతిపత్రం అందజేసినట్లు ఆసంఘం ప్రతినిధులు ఆకుల మురళీకృష్ణ, కరునకుమారి తెలిపారు. జిల్లాలో 63 మంది ఉపాద్యాయులు డీ ఈవో పూల్ లో ఉన్నారని, వారు పనిచేసే పాటశాలకు వేతనాలు తీసుకునే బడికి వంద కిమీ దూరం ఉందని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాద్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రీయలో డీఈవో పూల్ లో ఉన్న వుపద్యయులకు ఖాళీలలో భర్తీ చేసే అవకాశం కల్పించాలని కోరామన్నారు.
*ఏజెన్సీ నిర్వాహకులపై లాటీ చార్జి హేయమైన చర్య
విజయవాడలో సోమవారం మధ్యాహ్నం భోజన పధకాన్ని అక్షయ పాటర్కు అప్పగించ వద్దని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులపై పోలీసులు లాటీ చార్జి చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం హేయమైన చర్య అని సిఐటీయు డివిజన్ కార్యదర్శి ఎస్వీ భద్రం తెలిపారు.
* జమీయా మసీదు కమితే అద్యక్షుడిగా అబ్దుల్ హుస్సేన్
తిరువూరు జమీయా మసీదు కమిటీ అద్యక్షుడిగా మాజీ కౌల్సిలట్ షేక్ అబ్దుల్ హుస్సేన్ ఆరోసారి ఎన్నికయ్యారు. తిరువూరు పరిధిలోని 22మంది సభ్యులకు ఎన్నికలు నిర్వహించగా ఓట్ల లెక్కింపు అనంతరం అబ్దుల్ హుస్సేన్ ప్యానల్ సభ్యులు పదిహేను మంది విజయం సాధించారు.
*సౌర విద్యుత్ ఆటంకం పై ఆందోళన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలి రైతులకు రాయితీపై అందిస్తున్న సౌర విద్యుత్ పధకం అమలులో ఆటంకాలు తోఅల్గించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆద్వర్యంలో సోమవరం రైతులు ఆందోళన చేసారు. దీనిలో భాగంగా స్థానిక రెవెన్యు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, నినాదాలు చేసారు.
*నిషేదిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
నిషేధిత గుట్కా, సిగరెట్ ప్యాకెట్లు విక్రయిస్తున్నడనే ఫిర్యాదుల నేపద్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెక్టార్ 2 ఎస్సై అవినాష్ సిబ్బడ్నితో కలిసి సోమవరం పట్టాన పరిధిలోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.7650 విలువైన గుట్కా, సిగరెట్ ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. వీటిని విక్రయిస్తున్నా వ్యాపారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
*సౌర విద్యుత్ కు ఆటంకాల పై ఆందోళన
కేంద్ర ర్సహ్త్ర ప్రభుత్వాలు రైతులకు రాయితీపై అందిస్తున్న సౌర విద్యుత్ పధకం అమలులో ఆటంకాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆద్వర్యంలో సోమవారం రైతులు ఆందోళన చేశారు. దీనిలో భాగంగా స్థానిక రెవెన్యు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు.
*ఇళ్ళు, స్థలాల కోసం మహిళలు
నివేశన స్థలాలు ఇళ్ళు మజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ భారత కమ్యునిస్టు పార్టీ ఆద్వార్యంలో పలు గ్రామాల మహిళలు సోమవరం గంపలగూడెం రెవెన్యు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో భాగంగా పేద కుటుంబాల్లో చెందిన తమకు స్థలాలు, ఇల్లు మజూరు చేయాలని నినాదాలు చేశారు.
*ఇసుక క్వారీ అనుమతి ఇవ్వాలని వినతి
ఇసుక క్వరీలకు అనిమతివ్వాలని భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేశారు. సోమవారం వారు స్థానిక రెవెన్యు కార్యాలయంలో డీటీ డేవిడ్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎ.కొండూరు మండలంలో నాలుగు నెలలుగా ఇసుక లేకపోవడంతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వాలని కోరారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.