* ఈ నెల 22వ తేది సోమవారం తిరువూరులో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలక్టర్ ఎండి ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ శాఖల జిల్లా అధికారులు 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు తిరువూరులోనిర్వహించు స్పందన కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కలక్టర్ తెలిపారు.ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా నూజివీడు సబ్ కలక్టరును ఆదేశించారు.
*నెమలి ఆలయ సహాయ కమీషనర్ గా సంధ్య
గంపలగూడెం మండలం నెమలు వేణుగోపాల స్వామీ ఆలయ సహాయ కమీషనరుగా ఎం. సంధ్య నియమితులయ్యారు. విజయనగరం జిల్లా నుంచి ఆమె ఇక్కడికి బదిలీ పై వచ్చారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యెక పూజలు నిర్వహించి కార్యాలయంలో బాద్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎసీగా పనిచేసిన వినోద్ కుమార్ విశాఖపట్నం బదిలీ అయ్యారు.
*అన్నదాత అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు ‘
అన్నదాత ప్రతి అవసరాన్ని తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ జేడీ ఎన్.పద్మావతి తెలిపారు. శుక్రవారం ఎ.కొండూరు మండలం వచ్చిన ఆమె స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ఇక్కడ సమీకృత వ్యవసాయ విశ్లేషణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్రంలో వినియోగించే అవసరమైన పరికరాలు, ఇతర సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నట్లు చెప్పారు. ఇలా ఏర్పాటు చేసిన కేంద్రంలో భూసార, విత్తన, పురుగు మందులను పరీక్ష చేసి నాణ్యమైన వాటిని రైతులను అందజేస్తారని వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ జి.కెనడీ, ఏవో టిప్పుసుల్తాన్, ఏఈవో రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
*ఎరువులు విత్తనాల దుకాణాల్లో సంయుక్త తనిఖీలు
కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యు, పోలీస్ శాఖల ఆద్వర్యంలో తిరువూరులో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో శుక్రవారం సాయత్న్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసిలదరు ఎస్. నరసింహారావు ,ఏవో రాజ్యలక్ష్మి, ఎస్సై అవినాష్ సోదాలు చేశారు,. లైసెన్సు కాల పరిమితి , పీసీలు ఓం ఫాంలు సరుకు నిల్వ రిజిస్టర్లు ఇన్ వాయిస్ లు పరిశీలించారు. గోదాముల్ల్లో తనిఖీలు చేసి సరుకు నిల్వలను పరిశీలించారు. నిబంధనలు ప్రకారమే ఎరువులు పురుగు మందులు విక్రయించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు వినతి
గంపలగూడెం మండల, జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల సంబందించిన పోలింగ్ కేంద్రాలను మండల పరిదిలోని పలు గ్రామాల్లో అదనంగా ఏర్పాటు చేయాలని వైకాపా, భాజపా నాయకులూ కోరారు. మందాల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి ఆద్వర్యంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై అభ్యంతరాలను స్వీకరించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
*రాత పుస్తకాలూ వితరణ
తిరువూరు మండలం మల్లెల పరిధిలోని మూడు పాటశాలల్లో ప్రాధమిక సహాకార సంఘం ఆద్వర్యంలో రూ. ఆరువేలు విలువైన రాత పుస్తకాలును వితరనగా అందజేశారు. సీనియర్ ఉపాద్యాయుడు ఎస్.వీ.కే రమేష్ రూ. నాలుగు వేలు విలువైన బ్యాగులను సమకూర్చారు. పాటశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని మాజీ సర్పంచి కలకొండ రవికుమార్, ఎంపీటీసీ సభ్యుడు గడిపర్తి హనుమంతరావు, సిఈవో ఎం.వెంకటేశ్వరరావు విద్యార్ధులకు పంపిణీ చేహరు.
*వర్షాలు కురవాలని ముత్యాలమ్మకు పూజలు
తిరువూరులోని రరాజుపేటలో వర్షాలు సమృద్దిగా కురవాలని ప్రార్ధిస్తూ రాజుపేట వాసులు శుక్రవారం గ్రామదేవతకు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. మంగళవాయిద్యాల నడుమ కాలనీలో బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రాధాన్ కూడలి వద్ద ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి జలాభిషేఖం చేశారు.
*సరఫరా వాహినీ పూడ్చివేత పై ఫిర్యాదు
విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలోని సాగునీటి చెరువుకు నీటిని అందించే వాహినీ పూడ్చివేతకు గురైన విషయమై పలువురు ఆయకట్టు రైతులు శుక్రవారం నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని లంబాడా కుంట చెరువు ఆయకట్టులో సుమారు ఇరవై ఎకరాలను సన్న చిన్నకారు గిరిజన రైతులు యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని వర్షం ద్వారా చెరువులోకి చేరే నీరు ఈ పంటల సాగుకు ఆధారమన్నారు.
*మెరుగైన సేవలు అందించాలు
మీసేవ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలన్, దరఖస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఆన్ లిం చేయాలనీ తహసిల్దారు స్వర్గం నరసింహారావు సూచించారు. స్థానిక కార్యాలయంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు మాత్రమే ప్రజల నుంచి వసూలు చేయాలన్నారు. సాంకేతికపరామైన ఇబ్బందు లుంటే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
*పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాద్యత
పచ్చని చెట్లే ప్రక్రుతి సంరక్షకులని వాటిని శ్రద్దగా పెంసితేనే మానవాళికి స్వచ్చమైన ప్రాణ వాయువుతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. మండలమలోని చీమలపాడు జడ్పీ పాటశాలలో శుక్రవారం జరిగిన వనం-మనం కార్యక్రమానికి హాజరైన ఆయన పాటశాల ఉపాద్యాయులు, విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రతి మొక్కను విద్యార్ధులు సంరక్షించాలని సూచించారు.
*కౌలు రైతులకు రుణాలు మజూరు చేయాలి
ఎ.కొండూరు మండలలోని ఆయా గ్రామాల్లోని కౌలు రైతులకు బ్యాంకులుద్వారా వెంటనే రుణాలు మజూరు చేయాలని కౌలు రైతుల సంఘం మండల కార్యదర్శి పీ. ఆనందరావు తదితరులు డిమాండ్ చేశారు. మండల కౌలు రైతుల సంఘం ఆద్వర్యంలో శుక్రవారం చీమలపాడు సప్తగితి గ్రామీణ బ్యాంకు మేనేజరు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుణ అర్హత కార్డులు ఉన్న ప్రతి కౌలు రైతుకు బ్యాంకులు పంట రుణాలు మజూరు చేయాలని కోరారు.
*యువజనోత్సవల్లో విద్యార్ధుల ప్రతిభ
ఏపీ యువజన సం క్షెమ సఖ ఆద్వర్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 21 వరకు కర్నూలులో జరిగిన యువజనోత్సవల్లో స్థానిక వాహినీ కలశాల విద్యార్ధులు ప్రతిభ చాటారు. క్రీడా పోటీల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రికెట్ లో ప్రధమ, వాలీబాల్, ద్వీతీయ స్థానం సాధించారు. కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విజేతలుగా నిలిచినా విద్యార్ధులను ప్రిన్సిపాల్ డా. రంగా నాగేంద్రబాబు చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు కార్యదర్శి ఊటుకూరు సుబ్రహ్మణ్యం అభినందించారు.
*ఐదులోపు ఆన్ లైన్ నమోదు పూర్తీ చేయలి.
రోజువారీ పోషకార పంపిణీ, పిల్లల బరువు తూకం వేయడం, బలామృతం పంపిణీ ప్రతి నెల ఐదవ తేదీలోపు పర్తి చేసి ఆన్ లైన్ లో నమోదు చేయాలనీ సీడీపీవో సత్యవతి సూచించారు. స్థానిక షాదీఖానాలో శుక్రవారం తిరువూరు ప్రాజెక్టు పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు బలసంజీవినీ సక్రమంగా అందించాలని తెలిపారు.
*విస్సన్నపేట తహసీల్దారుగా మురళీకృష్ణ
విస్సనంపేట తహసిల్దరుగా బీ. మురళీ కృష్ణ శుక్రవారం బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఎం.సావిత్రిని సొంత జిల్లా తూర్పుగోదావరికి బదిలీ చేయగా అదే జిల్లాలో పని చేస్తున్న మురళీకృష్ణను ఇక్కడకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాబైనామా భూముల సమస్యల పరిష్కారానికి తొలుత ప్రాధాన్యత ఇస్తామన్నారు.
*నిబంధనలకు లోబడి ప్రయాణీకులను తరలించారు.
రహదారి బద్రత నిబంధనలకు లోబడి మాత్రమే అతోలాలో ప్రయాణీకులను తరలించాలని సెక్టార్-టూ ఎస్సై అవినాష్ డ్రైవర్లకు సూచించారు. పట్టణ పరిధిలోని బోసుబొమ్మ, జైభావీ, మధిర రోడ్డు కూడలి, బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్ లలో శుక్రవారం సాయంత్రం అవగాహనా సదస్సులు నిర్వహించారు. వాహనాలకు సంబందించిన రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారుల తనిఖిల సందర్భంగా చూపించాలని తెలిపారు.
*గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు అవసరం
వ్యవసాయ అనుబంధంగా గొర్రెలు పెంచే పెంపకందారులు తగిన జాగ్రత్తలు తీసుకోవలని పశుసంవర్ధక శాఖ ఏడీ డా.కోటగిరి రామారావు సూచించారు. మండలంలోని చింతలపడులో శుక్రవ్రం ఆశాఖ ఆద్వర్యంలో గొర్రెల పెంపకం దారుల శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నందున ముందుగానే నత్తల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు.
*అవయదనం పై అపోహాలు వీడాలి
ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు వీలున్న అవయవదానంపై ప్రజలు అపోహాలు వీడి ముందుకు రావాలని జీవన్ దాస్ సంస్థ సమన్వయ కర్త వంగూరి వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాటశాలలో సంస్థ అద్వర్యంలో శుక్రవారం సాయంత్రం విద్యర్దునులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భాగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సరైన అవగాహనా లేకపోవడం వల్ల అవయవదానం చేసేందుకు ముందుకు రావడం లేదని విస్తృత ప్రచారం ద్వారా చైతన్యం తీసుకురావాలని విద్యార్ధులు తమ వంతు కృషి చేయాలనీ సూచించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.