* తిరువూరు నగర పంచాయతీ లో ఉద్యోగుల కొరత వేదిస్తుందని వెంటనే ఖాళీల భర్తీలు నియామకం చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ను కోరిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ..కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “అమృత్ పథకం ద్వారా తిరువూరు మున్సిపాలిటీకి త్రాగునీరు అందించాలని తెలిపిన ఎమ్మెల్యే రక్షణనిధి.నగరపంచాయతి అభివృద్ధి చేపట్టేందుకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రిని కోరిన ఎమ్మెల్యే రక్షణనిధి..నగరపంచాయతి అభివృద్ధి కాంక్షిస్తూ పలు సమస్యలపై మంత్రి బొత్సకు వినతిపత్రం రూపంలో తెలియజేసిన-ఎమ్మెల్యే రక్షణనిధి
* తిరువూరు నగర పంచాయతీ లో ఉద్యోగుల కొరత వేదిస్తుందని వెంటనే ఖాళీల భర్తీలు నియామకం చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ను కోరిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ..కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “అమృత్ పథకం ద్వారా తిరువూరు మున్సిపాలిటీకి త్రాగునీరు అందించాలని తెలిపిన ఎమ్మెల్యే రక్షణనిధి.నగరపంచాయతి అభివృద్ధి చేపట్టేందుకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రిని కోరిన ఎమ్మెల్యే రక్షణనిధి..నగరపంచాయతి అభివృద్ధి కాంక్షిస్తూ పలు సమస్యలపై మంత్రి బొత్సకు వినతిపత్రం రూపంలో తెలియజేసిన-ఎమ్మెల్యే రక్షణనిధి
*వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని వినతి
వాల్మికీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్ష కర్మాగారాలు శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం కు ఎపీవీఈపీఏ నాయకులూ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు గురువారం ఆయనను విజయవాడలో కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. వాల్మికీ బోయల చిరకాల ఆకాంక్షను నేతవేర్చాలని కోరారు.
*వెలుగు ఏపీఎం లు బాద్యతలు స్వీకరణ
తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాలకు మండల మహిళా సమాఖ్య కార్యాలయాలకు నూతనంగా ఏపీఎం లు బాద్యతలు స్వీకరించారు. తిరువూరు ఏపీఎంగా ఎం.గురవయ్య, గంపలగూడెం ఏపీవోగా తాళ్ళ జయశేఖర్, ఎ.కొండూరు ఏపీఎంగా రామాల సత్యం బాద్యతలు గురువారం స్వీకరించారు.
*తిరువూరు రైతు బజారు ఈవోగా పుష్పవల్లి
తిరువూరు రైతుబజరు ఎస్టేట్ ఆఫీసర్ గా కే.పుష్పవల్లి గురువారం బాద్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆమె ఇప్పటి వరకు పని చేసిన శ్రీకాంత్ నుంచి బాద్యతలు స్వీకరించారు.
*రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
తిరువూరు మండలం కొకిలంపాడు సమీపంలో కట్లేరు వాగు నుంచి నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తున్నరనే సమాచారం మేరకు సెక్టార్ 2 ఎస్సై అవినాష్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమంగా రావాన చేస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వాహనాల డ్రైవర్ల పై కేసు నమోదు చేశారు.
*జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
విస్సన్నపేటలో ఈనెల 23, 24 తేదీల్లో జరిగే పశ్చిమ కృష్ణా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు విజయవంతం చేయాలనీ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం మండల కార్యదర్శులు పీ. ఆనందరావు, డీ. రాముడు విజ్ఞప్తి చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఈ సభలకు వ్యవసాయా కార్మిక సంఘాల నాయకులూ కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
*చేతి పంపులకు మరమ్మతులు ‘
భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపద్యంలో చేతి పంపులు మూలకు చేరడం వాళ్ళ తాగునీటికి అవస్థలు పడుతున్నామని ప్రజలు నుంచి వస్తున్నా ఫిర్యాదులు మేరకు సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. మండలమలోని ఎర్రమాడులో మొరాయిస్తున్న చేతిపంపులకు గురువారం మరమమతులు చేశారు. భూగర్భ జలాలు అడుగంటిన వాటికి అదనంగా పైపులు దింపారు. మిగిలిన వాటిని పరికరాలు వేసి, సమస్యను పరిష్కరించారు.
*22న మారెమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
విస్సన్నపేట మండలం పుట్రెలలోని మారెమ్మ అమ్మవారి అదేవాలయంలో ఈనెల 22న హుండీ ఆదాయం లేక్కిన్చానునంట్లు దేవాలయ కర్యనిర్వహనధికారి జయప్రకాశ్ బాబు తెలిఅప్రు.
*రాత్రి బాసలో ప్రజా సమస్యల పై ఆరా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో బుధవారం రాత్రి ఎస్సై ఉమామహేశ్వరరావు బస చేశారు. పల్లెనిద్రలో భాగంగా గ్రామంలోరాత్రి బస చేసిన అయన అక్కడి సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతిబద్రతలు పై ప్రజలకు వివరిమ్కాహ్రు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే బాద్యులపై కటిన చర్యలు తీసుకుంటామని అనంరు.
* కొనసాగుతున్న వాలంటీర్ల ఇంటర్వ్యూలు
తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల్లోని పరిషత్ కార్యాలయాల్లో వాలంటీర్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యులు నిర్వహించారు. తిరువూరు మండలం కాకర్ల, వముకుంట్ల, రోలుపడి, ఎ.కొండూరు మండలం కోడూరు, రేపూడి తండా గ్రామాల్లో, విస్సన్నపేట మండలంలో పుట్రెల వేమిరెడ్డిపల్లి , గంపలగూడెం మండలం వినగడప, కొనిజెర్ల గ్రామలకు చెందిన వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ ఇంతర్వ్యులు నిర్వహించారు.
*తిరువూరు తహసీల్దారుగా నరసింహారావు
తిరువూరు తహసిలదారు గా స్వర్గం నరసింహారావు గురువారం బాద్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తహసిల్దారు క్రిష్ణజ్యోతి నుంచి ఆయన బాద్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనను పాలకొల్లు నుంచి ఇక్కడకు బదిలీ చేశారు. అధికారులు కార్యాలయ ఉద్యోగులు ఆయనకు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
*పర్యావరణ పరిరక్షణ పై ప్రదర్శన
పర్యావరణ పరిరక్షణ స్వచ్చత పై విస్సన్నపేటలో శ్రీచైతన్య పాటశాల విద్యార్ధులు గురువారం ప్రదర్శన నిర్వహించారు. స్థానిక శ్రీచైతన్య విద్యా సంస్థల నుంచి ప్రారంభమైన ప్రదర్శన అంబేద్కర్ కూడలి వరకు చేరుకొని తిరిగి అక్కడి నుంచి విద్యా సంస్థలు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెరిన్సిపాల్ ఎస్కే. సైదులు , ఉపాద్యాయులు పాల్గొన్నారు.
*ఆదర్శ పాటశాలకు రూ. 30వేలు వితరణ
గంపలగూడెం మండలం పెదకోమిర ఆదర్శ పాటశాలకు గంపలగూడెం కు చెందిన కుండా కోటేశ్వరరావు రూ. 30 వేలు వితరనగా అందించారు. దాత అందించిన విరాళంతో పాటశాలలో ఆరవ తరగతి అభ్యసిస్తున్న వంద మంది విద్యార్ధులకు రూ.పాతికవేలు విలువైన సంచులు, పాటశాలకు రూ.ఐదు వేలు విలువైన పాతిక గోడగడియారాలు కొనుగోలు చేశారు. పాటశాలలో ప్రిన్సిపాల్ కే.రత్న ప్రతిష్ట ఆద్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాగులు పంపిణీ చేశారు.
*వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ
తిరువూరు శ్రీవేంకటాచలస్వామీ ఆలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా గురువారం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆద్వర్యంలో స్వామివారికి విశేష పూజల్లో భాగంగా అభిషేకాలు అర్చనలు చేశారు. ప్రత్యేకంగా అలరించిన స్వామీ వారిని భక్తులు దర్శించుకున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయరు స్వామివారి అనుబందం సంస్థ వికాస తరంగిణి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయరు స్వామివారి అనుబంధ సంస్థ వికాస తరంగిణి తిరువూరు శాఖ వారు పర్యవేక్షించారు.
*పిడుగుపాటు జీవాల మృతి
విస్సన్నపేట మండలం పుట్రెలలో గురువారం పిడుగు పాటుకు ఏడు మేకలు మృతి చెందాయి. గ్రామంలోని ఉత్తర ఎస్సీవాడకు చెందిన ఇంజమర్ల రవీంద్ర మేకలు మేపెందుకు సమీపంలోని మామిడితోటలో ఉండగా వర్షం ఆరంభమైంది. వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగు పడటంతో రవీంద్ర త్రుటిలో తప్పించుకున్నారు. మేకలు గుంపులో ఏడు అక్కడికక్కడే మృతి చెందిన కొన్ని గాయపడ్డాయి. మరికొని దూరంగా పారిపోయాయి.
*డీలర్ల వ్యవస్థను కొనసాగించాలి వినతి
రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగించాలి కొరుతూ మందిల రేషన్ డీలర్ల సంఘం ఆద్వర్యంలో డీలర్ల గురువారం అధికారులకు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం అద్యక్షుడు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థలో రద్దు చేస్తుండనే ప్రచారం జరుగుతుంది అన్నారు. ఇదే జరిగితే డీలర్ల ఉపాధి దెబ్బతిని రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.