* ఊరటనిచ్చిన వర్షం
గత నెలరోజుల నుండి వేసవి తాపంతో తల్లడిల్లుతున్న తిరువూరు పరిసర ప్రాంత ప్రజలకు గురువారం కురిసిన వర్షం కాస్త ఊరట నిచ్చింది. ఎండిపోతున్న వరినారుమల్ల ఈ వర్షం జీవం పోసింది.
* కొనసాగుతున్న వాలంటీర్ల ఇంటర్వ్యూలు
తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల్లోని పరిషత్ కార్యాలయాల్లో వాలంటీర్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యులు నిర్వహించారు. తిరువూరు మండలం కాకర్ల, వముకుంట్ల, ఎ.కొండూరు మండలం గొల్లమందల తండా, కేశ్యా తండావల్లంపట్ల, జీల్లకుంట మారేపల్లి గ్రామాల్లో, విస్సన్నపేట మండలంలో తాటకుంట్ల, వేమిరెడ్డిపల్లి గ్రామలకు చెందిన వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ ఇంతర్వ్యులు నిర్వహించారు.
* పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ
పచ్చదనం పెంపొందించడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. గంపలగూడెం మండలంలోని పెదకోమిర, అమ్మిరెడ్డిగూడెం, గంగాదేవరపాడు, గోసవీడులో పోలీసులు ఆద్వర్యంలో బుధవారం వనం మనం కార్యక్రమం చేపట్టారు. ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
* కుష్టు వ్యాధితో ఆందోళన అవసరం లేదు
కుష్టు వ్యాధితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నూజివీడు డివిజన్ ఉప పారా మెడికల్ అధికారి బాబూరావు తెలిపారు. ఎవరికైనా ఈ వ్యాధి సంక్రమించిన ఏడాదిలోపే తగ్గించేందుకు ప్రభుత్వం ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మండలంలోని సత్యాలపాడు జడ్పీ ఉన్నత పాటశాలలో బుధవారం వ్యాధి లక్షణాల పై విద్యార్ధులకు అయన అవగాహన కల్పించారు.
* పంచాయతీ కార్యనిర్వాహనదికరిగా శ్రీనివాసరావు
విస్సన్నపేట పంచాయతీ కార్యనిర్వహనదికరిగా బీ.ఎస్.ఎస్.శ్రీనివాసరావు బుధవారం బాద్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎం. సరోజినీని ఉన్నతాధికారులు జీ.కొండూరు మండలం వెలగలేరు పంచాయతీకి బదిలీ చేశారు.
* బిందు సేద్యం పై అవగాహన
బిందు, తుంపర సేద్యం పై రైతులకు అవగాహనా ఉండాలని సూక్ష్మ సేద్యం జిల్లా అధికారి రామ్మోహన్ రెడి సూచించారు. పంటల సాగులో బిందు, తుంపర సేద్యం అమల్లు చేస్తే నీటి వ్రుదాను అరికట్టవచ్చును తక్కువ నీతితో ఎక్కువ పంటలుకు సాగునీరు అందించావచ్చానారు. గంపలగూడెం మండలంలోని కొనిజెర్లలో బుధవారం రైతులకు సూక్ష్మ సేద్యంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. క్షెత్ర స్థాయిలో ఈ పధకం అమలు ద్వారా లభించే ఫలితాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్యం పధకంలో ఇదేకరాలు వరకు తొంభై శాతం ఆపై భూమి ఉన్న రైతులకు యాభై శాతం ఐదు ఎకరాలలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం రాయితీతో బిందు, తుంపర సేద్యం పరికరాలను అందిస్తున్నట్లు వివరించారు.
* సంప్రోక్షణ అనంతరం స్వామీ దర్శనం
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి ఆలయం మూసివేసిన సంగతి తెల్సిందే. బుధవారం అర్చకులు ఆలయాన్ని శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు.
* విద్యార్ధుల ప్రతిభ
గంపలగూడెం మండలం పెదకోమిర ఆదర్శ పాటశాల కు చెందిన 22 మంది విద్యార్ధులు హిందీ పరీక్షల్లో ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ కే.రత్నమేరీ ప్రతిష్ట బుధవారం తెలిపారు. గత ఫిబ్రవరిలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆద్వర్యంలో నిర్వహించిన మాధ్యమిక రాష్ట్ర హిందీ పరీక్ష ఫలితాలు విడుదలవ్వగా పాటశాలకు చెందిన విద్యార్ధులకు ఉత్తీర్ణత పత్రాలు ఇటీవల పంపించారని చెప్పారు. పాటశాల హిందీ అధ్యాపకులు దేవరాజుగట్టు శివకుమారి ఆద్వర్యంలో పాటశాలకు చెందిన ఏడు నుంచి పడవ తరగతి వరకు అభ్యసించే 22 మంది విద్యార్ధులు హిందీ పరీక్షకు హాజరావ్వగా వారిలో పద్దెనిమిది మంది మాధ్యమిక, నలుగురు రాష్ట్ర పరీక్షల్లో ఉత్తీర్ణత చెందినట్లు చెప్పారు. బుధవారం ఆ విద్యార్ధులకు దృవీకరణ పటాలు అందజేశారు.
* విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు అపారం
ప్రస్తుతం ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ అమెరికా ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఇంజనీరింగ్ విద్యార్ధులకు అపారమైన ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయని గుంటూరు జేమ్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్ సంస్థ డైరెక్టర్ పాల్ వెస్టీ తెలిపారు. స్థానిక వాహినీ కళాశాలలో విదేశీ విద్యపై బుధవరం అవగాహనా సదస్సు నిర్వహించారు. పలు అంశాలపై విద్యార్ధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. రంగా నాగేంద్రబాబు కార్యదర్శి ఊటుకూరు సుబ్రహ్మణ్యం వైస్ ప్రిన్సిపాల్ ఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
* 20న క్యాన్సర్ నిర్ధారణ ఉచిత శిబిరం
స్థానిక అమరావతి మల్టీ స్పెషాలిటీ సుపత్రిలో ఈనెల 20న ఉదయం 6 నుంచి 4 గంటల వరకు వెంకట సాయి రాఘవ ఆటో ప్యూయల్ లాస్య సర్వీస్ స్టేషన్ సహకారంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిభిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి చైర్మన్ కోనేరు వెంకట కృష్ణన్ తెలిపారు.
* మైదానం మధ్యలో రోడ్డు సరికాదు
కంభంపాడు జడ్పీ పాటశాలలో ఆటస్థలం మీదుగా తన సొంత ప్రయోజనాల కోసం రోడ్డు వేసేందుకు ప్రయత్నించడం సరికాదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాలం ఆంజనేయులు, మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వినర్ భూక్యా గన్యా, ఎస్ఎం సి చైర్మన్ కే.చెన్నారావులు అన్నారు. ఎ చర్యలను అడ్డుకోవాలంటూ ఎమ్మెల్యే కే.రక్షణనిధి , ఎంపీ కేశినేని శ్రీనివాస్, జడ్పీ మాజీ అధ్యక్షురాలు అనురాధను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
* మద్యం గొలుసు దుకాణదారుడి అరెస్టు
తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం అక్రమంగా తీసుకువెళ్తూ నిబందహనలకు విరుద్దంగా గొలుసు దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని వావిలాలకు చెందిన వేల్పుల లాలయ్య ఖమ్మం జిల్లా వెన్నవల్లి నుంచి మద్యం సీసాలను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఏ ఎస్సై రంగయ్యనాయుడు సిబ్బందితో కలిసి బుధవారం నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతమైన వావిలాల వద్ద తనిఖీలు చేయగా లాలయ్య మద్యం సీసాలు తరలిస్తూ పట్టుబడ్డాడు అతని నుంచి 51 సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
* భూసారం పెంపొందించుకోవాలి
భూసారం పెంపొందించుకోవడానికి సాగు చేసిన పచ్చిరోట్టను పూత దశకు ముందే నెలలో కలియడున్నాలని ఏవో రాజ్యలక్ష్మి సూచించారు. మండలంలోని లక్ష్మీపురంలో పొలం పిలుస్తోంది మండలంలో లక్ష్మీపురంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా క్షెత్ర స్థాయిలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. అనంతరం జరిగిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడుతూ ముందుగానే కలియడున్నడం వాళ్ళ పాతిక శతం నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులను ఆదా చేసుకునే వీలుందని తెలిపారు. సింగిల్ సూపర్ ఫ్సాపేట్ ఎరువును చల్లి పంటను దున్నడం వల్ల త్వరగా నేలలో చివుకుతుందని పేర్కొన్నారు. ప్రతీకూల వాతావరణ పరిస్థితుల నేపద్యంలో పంటల ఎదుగుదల లోపించిందని తెలిపారు.
* ర్యాగింగ్ చేస్తే ధైర్యంగా ఎదుర్కొంది
కళాశాలల్లో ర్యాగింగ్ చేస్తుంటే ధైర్యంగా ఎదుర్కోవాలని సిఐ ప్రసన్నవీరయ్యగౌడ్ విద్యర్దునులకు సూచించారు. స్థానిక నాగార్జున జూనియర్ కళాశాలలో శక్తి బృందం ఆద్వర్యంలో బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. బాలికలకు ఇబ్బందులు ఎదురైతే తక్షణం తమకు సమాచారం అందించాలని సూచించారు. కళాశాలలు పునః ప్రారంభమైన తరువాత జరిగే ర్యాగింగ్ ను కట్టడి చేయడానికి యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.