* తిరువూరు నియోజకవర్గ సమస్యలపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను కలిసిన ఎమ్మెల్యే రక్షణనిధి
నియోజకవర్గంలో అవసరమైన చోటా వాటర్ హెడ్ ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్లు మంజూరు చేయాలి-ఎమ్మెల్యే
మండల పరిధి వాగుల్లోంచి ఇసుక కొరకు అనుమతులివ్వాలి- ఎమ్మెల్యే
ఏ-కొండూరు, తిరువూరు మండలాల్లో పలు గ్రామాల్లో, తండాల్లో మంచినీటి సదుపాయం సరిగా లేని కారణంగా ప్లోరెడ్ వలన ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని సమస్య అధికంగా ఉన్న చోట ఓవర్ హెడ్ ట్యాంకులు,ఆర్వో ప్లాంటులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కోరడం జరిగింది.._అదేవిధంగా తిరువూరు మండలంలో ఇసుక కొరత నెలకొన్న కారణంగా భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందని పేర్కొంటూ.. మండలంలో గతంలో కట్టలేరు, ఎదుళ్లవాగు, విప్లవవాగు, పడమటివాగుల్లో ఇసుక అందుబాటులో ఉండేదని నూతన ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఆంక్షలు విధించడంతో ఇసుక తొలకాలు నిలిచిందన్నారు..రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేవరకు మండలంలో అందుబాటులో ఉన్న ఇసుకను మైనింగ్,రెవెన్యూ శాఖల సమక్షంలో అనుమతిలివ్వాలని కలెక్టర్ కు తెలిపారు..ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా ఉదయం 6.గం.ల నుండి- సాయంత్రం 6.గం.ల వరకు సినరేజ్ (చలనా)వసూలు చేసి పగడ్బందీగా తొలకాలు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ కు కోరుతూ వినతిపత్రం అందజేశారు..
*తిరువూరు నియోజకవర్గంలో వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెం. ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల్లో మంగళవారం గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా ఆలయాల్లో అర్చకుల ఆద్వర్యంలో విశేష పూజలు అర్చనలు అభిషేకాలు చేశారు. తెల్లవారు జమున నుంచే భక్తులు బాబాని దర్శించుకునెందుకు బారులు తీరారు. భక్తబృందాలు ఆలపించిన భక్తీ గీతాలు భజనలు చేసారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. కొన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.
*మంత్రికి పాస్టర్ల కృతజ్ఞతలు
గంపలగూడెం మండలం పాస్టర్స్ ఫెలో షిప్ సమావేశం మంగళవారం గంపలగూడెం షాలేము క్రైస్తావాలయంలో నిర్వహించారు.క్రైస్తవ మ,మత బోధకులుకు ఐదు వేలు గౌరవ వేతనం అందించేందుకు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు కృతగ్ణతలు తెలుపుతూ సమావేశంలో పాల్గొన్న పాస్టర్లు తీర్మానించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, గంపలగూడెంలో క్రైస్తవులకు సామాజిక భవనం నిర్మించాలని పాస్తార్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
*నెమలి లో మాస కళ్యాణం
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామీ ఆలయంలో మంగళవారం స్వామివారి మసకల్యనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గోపాలాచార్యులు ఆద్వర్యంలో రుత్విక బృందం రుక్మిణీ, సత్యభామా సమెత వేణుగోపాల స్వామీ ఉత్సవ విగ్రహాలను ఉదయం పది గానతలకు ఆలయం నుంచి మేళ తాళాలతో యగాశాలకు తీసుకువచ్చి రెండు గంటలపాటు కల్యానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
*నెమలి ఆలయం మూసివేత
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామీ ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మూసివేసారు. ప్రధానార్చకులు గోపాలాచార్యులు ఆద్వర్యంలో అర్చక బృందం గర్భగుడి తలుపులు మూసి తాళాలు వేశారు.
*తిరువూరు సీడీపీవోగా సత్యవతి
ఐసీడీఎస్ తిరువూరు ప్రాజెక్టు సీడీపీవోగా సత్యవతి మంగళవారం బాద్యతలు స్వీకరించారు. బుట్టాయగూడెం ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున ఆమెను ఇక్కడకు బదిలీ చేశారు. ఉద్యోగులు సిబ్బంది ఆమెకు పుష్ప గుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారం గర్భిణులు బాలింతలకు పిల్లలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
*చెట్టును నరికేశారని ఫిర్యాదు
గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామా పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న వేప చెట్టును అక్రమంగా నరికేశారని వైకాపా మండల కన్వినర్ చావా వెంకటేశ్వరరావు మంగళవారం ఎంపీడీవో పిచ్చిరెడ్డికి ఫిర్యాదు చేశారు. సుమారు 30 ఏళ్ల వయసున్న చెట్టును అక్రమంగా కొట్టేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై విచారణ ప్రారంభించమని అనుమతి లేకుండా చెట్టు నరికిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యల కోసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని అదేసిన్చానని ఎంపీడీవో తెలిపారు.
*ఇంటర్ విద్యార్ధులకు బోజన పధకం అమలు చేయాలి
ఎ.కొండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మద్యాహ్న భోజన పధకాన్ని కొనసాగించాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి చిమటా వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో మద్యాహ్న భోజనం పధకం అమలు చేయాలనీ కోరుతూ స్థానిక ప్రభువా జూనియర్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు పధకాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
*కొనసాగుతున్న ఇంటర్వ్యులు
ఎ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో గ్రామా వాలంటీర్ పోస్టులకు మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యులు మంగళవారం సైతం కొనసాగాయి. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు ఏవోల ఆద్వర్యంలో ఈ ఇంటర్వ్యులు నిర్వహించారు.
*విజ్ఞానంతోనే ఉన్నతి
చదువుతో పాటు ప్రపంచం నలుమూలలా జరుగుతున్నా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని వృద్ది చేసుకోవాలని వ్యక్తీ వికాస నిపుణుడు తీ.వేణుగోపాల్ విద్యార్ధులకు సూచించారు. గంపలగూడెం మండలం ఊటుకూరులోని వాసవీ, వనితా క్లబ్ ఆద్వర్యంలో శ్రీకృష్ణరాయ కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాసం పై సందేశమిచ్చారు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందకుండా ఎవరూ ఏమీ సాధించలేరని చెప్పారు.
*అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరిచాలి
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిఐటీయూ అనుబంధ ముటా వర్కర్సు యూనియన్ పశ్చిమ కృష్ణా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంగళవారం సంఘ మహాసభ నిర్వహించారు. హమలీలుగా పని చేస్తున్న వారికి గుర్తింపు కార్డులు జరీ చేసి ప్రభుత్వ పధకాలను వర్తింపజేయాలని కోరారు.
*కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
ప్రభుత్వం రుణ అర్హత కార్డులు జారీ చేసిన కౌలు రైతులకు పంట రుణాలను మంజూరు చేయాలనీ స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రా బ్యాంకు మేనేజర్లకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులూ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయా బ్రాంచీ కార్యాలయాల్లో మేనేజర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. రెవెన్యు, వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో గ్రామాల వారీగా గ్రామా సభలు నిర్వహించి స్వీకరించిన దరఖారులు ఆదారంగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసినప్పటికీ రుణాల మంజూరులో జాప్యం నేలకుందన్నారు.
*ఖరీఫ్ నుంచి వైఎస్సార్ పంటల భీమా
ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకాన్ని ప్రారంభిస్తోందని ఏఈవో రామచంద్రరావు తెలియజేశారు. మండలంలోని వ్యవసాయ సఖ ఆద్వార్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి, పత్తి, మిరప పంటల బీమా కోసం ఎకరాకు రూ.1 చెల్లించటం ద్వారా బీమా వర్తిస్తుందన్నారు. ప్రక్రుతి వైపరిత్యాలు సమయాల్లో ఇది అక్కరకు వస్తుందన్నారు. అనంతరం వరి నారుమడులును, పత్తి పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈవోలు రైతులు పాల్గొన్నారు.
*తిరువూరులో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా
తిరువూరు పట్టణంలో తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయాలనీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పేరిట పట్టాన కమిటీ నాయకులు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా తాగునీటి సరఫరాను మంగళవారం పార్టీ నాయకులు వెలుగోటి ఆదిఅనారాయణ, తంగిరాల వెంకటరెడ్డి, ఏరువ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. భూగర్భ జలాలు అడుగంటిన నేపద్యంలో రక్షిత నీటి పధకం బోర్లు మొరాయించడంతో పురపాలక సంఘం ఆద్వర్యంలో తాగునీటిని సరఫరా చేయడానికి అవరోధంగా మారింది.
*సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి
తిరువూరు నియోజకవర్గంలో నేలకున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఇంతియాజ్ కు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎ.కొండూరు, తిరువూరు మండలాల్లో ప్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేయడానికి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలనీ కోరారు. ఇసుక కొరత కారణంగా భావన నిర్మాణ కార్మికులు జీవనోపాది కోల్పోతుండగా కట్లేరు, ఎదుళ్ళ వాగు విప్లవవాగు, పడమటి వాగు నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తరలించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.