*న్యాయవాదులకు నిధుల కేటాయింపు పై హర్షం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో న్యాయవాదుల సం క్షేమా నిధికి నిధులు కేటాయించడం పై తిరువూరు బార్ అసోసియేషన్ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
*రాత పుస్తకాలు అందజేత
తిరువూరు ప్యాక్టరీ సెంటరులో మండల పరిషత్ ప్రాధమిక ఉర్దూ పాటశాల ఉపాద్యాయులు తమ సొంత ఖర్చులతో విద్యార్ధులకు రాత పుస్తకాలు అందజేశారు. బడిలో శుక్రవారం జరిగిన కార్యక్రమలో ప్రధానోపద్యయుడు జూల్ఫీకర్ అలీ పంపిణీ చేశారు.
*చెన్నరాయుని సేవ
తిరువూరు, గంపలగూడెం మండలాల్లో చెన్నరాయుని సేవ కార్యక్రమం భక్తులు నిర్వహించారు. వరుణుడు కరుణించి సమృద్దిగా వర్షాలు కురిపించాలని ప్రార్ధిస్తూ తిరువురులోని రాజుపేట, గంపలగూడెం మండలం సత్యాలపాడులో ఈ సేవ ప్రారంభించారు.
*ఇసుక ట్రాక్టర్ పట్టివేత
తిరువూరు మండలం చిట్టేల సమీపంలోని కట్లేరు వాగు నుంచి ఇసుక అక్రామంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను ఎసై మనికుమార్ శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహన యజమాని డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
*వనం మనం మొక్కల పంపిణీ
తిరువూరు మండలం ఎర్రమాడు ప్రాధమిక ఉన్నత పాటశాలలోని ఆవరణలో శుక్రవారం వనం మనం భాగంగా విద్యార్ధులతో కలిసి సెక్టార్ ఎస్సై అవినాష్ మొక్కలు నాటారు. నర్సరీ నుంచి తీసుకెళ్ళిన మొక్కలను నివాస గృహాలలో నాటేందుకు వీలుగా ప్రజలకు పంపిణీ చేశారు.
*వాలంటీర్లకు ఇంతర్వ్యులు
నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో వాలంటీర్ల పోస్టులకు స్థానికం,గా ఉన్న మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు అభ్యర్ధులకు ఇంటర్వ్యులు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తు దారులు కార్యాలయాలకు చేరుకున్నారు.
*గంపలగూడెం తహసీల్దారుగా పద్మజ
గంపలగూడెం మండల తహసీల్దారుగా పద్మజ బాద్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల నేపద్యంలో జరిగిన బదిలీల ప్రక్రీయలో ఆమెను తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు బదిలీ చేశారు. తిరిగి జిల్లాకు వచ్చిన ఆమెను గంపలగూడెం తహసీల్దారుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వ్యులు జరీ చేసారు.
*విస్సన్నపేట సీడీపీవో గా లలితకుమారి.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ విస్సన్నపేట సీదీపీవో గా ఎం.లలితకుమారి శుక్రవారం బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఇందిరాకుమారి ఉద్యోగ విరమణ పొందగా, మైలవరం సీడీపీవో బాద్యతలు నిర్వర్తిస్తున్న లలితకుమారిని ఉన్నతాధికారులు ఇక్కడికి బదిలీ చేహరు.
*రఘునందన్ కు సత్కారం
ప్రతిజ్ఞ రచయిత పైదిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను హిందీ బాషలోకి అనువాదం చేసిన హిందీ ఉపాద్యాయుడు రఘునందన్ తమ పాటశాలలో పనిచేయడం గర్వంగా ఉందని మునుకుళ్ళ జడ్పీ ఉన్నత పాటశాల పనిచేయడం గర్వంగా ఉందని స్థానిక జడ్పీ ఉన్నత పాటశాల ప్రధానోపద్యాయుడు బీవీ వీరభద్రం తెలిపారు.
*రేషన్ బియ్యం పట్టివేత
తిరువూరు మండలంలోని మునుకుల్ల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నరనే సమాచారం మేరకు పీడీఎస్ డీటీ రామచంద్రరాజు శుక్రవారం సోదాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన రామాకనకా చారి ఇంట్లో సోదాలు నిర్వహించగా పదహారు క్వింటల్ల రేషన్ బియ్యం పట్టుబడింది.
*వ్యక్తీ మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తీ చికిత్స పొందుతూ మృతి చెందారు. విస్సన్నపేటకు చెందిన అక్షింతల సత్యనారాయణ ఈనెల అరవ తేదీన స్థానిక రాజీవ్ నగర్ కాలనీ నుంచి విస్సన్నపేట వైపు వస్తుండగా గుర్తు తెలియని౯ వాహనం డీకొంది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను కుటుంబ సభ్యులు వైద్య సేవల నిమిత్తం విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
*తిరువూరు ఎంపీడీవోగా జానకీదేవి నియామకం.
* తిరువూరు మండల రెవెన్యూ అధికారిగా స్వర్గం నరసింహారావు నియామకం.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.