దాదాపు ఐదు నెలల విరామం అనంతరం తిరువూరు పరిసర ప్రాంత ప్రజలను వరుణుడు కరుణించాడు. సోమవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతూ ప్రజలకు ఆహ్లాదం కలిగించాయి. మండు వేసవిలో ప్రతినిత్యం 45 డిగ్రీల వేసవి తాపాన్ని ప్రజలు అనుభవించారు. వర్షం రాకతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. రైతులు వ్యవసాయ పనుల కోసం సిద్ధమవుతున్నారు. భారీవర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. Tags: Tiruvuru Weather News, Tiruvuru Krishna District News, Tiruvuru News, Tiruvuru Kaburlu