ఈ రోజు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టివిక్రమార్క తిరువూరు కాంగ్రెస్ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్బంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ దేశానికి కాంగ్రెస్ వలనే న్యాయం జరుగుతుంది అని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుని కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తద్వారా తెలుగు రాష్ట్రాలలో పూర్వ ప్రాబల్యం వస్తుందని కార్యకర్తలు నిరుత్సహపడకుండా కుల మత వర్గ వైషమ్యాలు లేకుండా కష్టపడి పనిచేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, బొడ్డు ప్రకాశరావు, మేడ సురేష్, రామిశెట్టి జయరాజు, పల్లెపాటి శ్రీనివాసరావు, తాడిశెట్టి పూర్ణచంద్రరావు, నల్లమోతు శ్రీనివాసరావు, గంజా కృష్ణమోహన్, హరిబాబు, జగన్నాథం, కె.ఎల్.రావు, జీవనబాబు, విజయలక్ష్మి తదితర సీనియర్ నాయకులు పాల్గొని విక్రమార్కకు స్వాగతం పలికారు.