ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత మూడు పర్యయాల నుండి తిరువూరులో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా తెదేపా తరపున పోటీ చేస్తున్న కే.ఎస్. జవహర్ విజయం సాధించడం కష్టమని అన్ని సర్వేలు తెలిపాయి. ఈ తరుణంలో ముఖ్యామంత్రి చంద్రబాబు సభకు అనుకున్నదాని కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో తెలుగుదేశం పార్టీలో విజయోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తిరువూరు ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటె ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోందని 35 సంవత్సరాల నుండి తాను తిరువూరు వస్తున్నప్పటికీ ఇంత ఆదరణ ప్రజల్లో ఎక్కడ కనిపించలేదని పేర్కొన్నారు.
*** తిరువూరుకు వరాల జల్లు
ఈ సందర్భంగా చంద్రబాబు తిరువూరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. మరో ఏడాదిలో చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని పూర్తీ చేసి గోదావరి జలాలు తిరువూరుకు అందిస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను కాపాడి వరకు రక్షిత మంచినీరు ఇస్తానని, అవసరమైన చోట్ల పొలాలకు సాగు నీరు అందిచడానికి స్థానికంగా ఉన్న వాగులపై ఎత్తిపోతల పధకాలు ఏర్పాటు చేస్తామని, సాగర్ జలాలకు సక్రమంగా అందేతట్లు చూస్తానని ప్రకటించారు. తిరువూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తామని, ముస్లీములు, క్రైస్తవులు, విశ్వబ్రాహ్మణులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు.
*** దేవగౌడకు పాదాభివందనం
మఖ్యమంత్రి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరువూరు వస్తారని ప్రకటించినప్పటికి నాలుగున్నర గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన తిరువూరుకు వచ్చారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల నుండి బోసుబొమ్మ వరకు ర్యాలీగా వచ్చిన చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్ధి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్ధి కే.ఎస్.జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మార్క్ ఫెడ్ చైర్మన్ కంచి రామారావు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. దాదాపు ఒక గంట సేపు తిరువూరులో ఉన్న ముఖ్యమంత్రి ఐదున్నర గంటలకు హెలికాప్టర్ ఎక్కారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.