జిల్లాలో 5నియోజకవర్గాల ప్రచార పర్యటనలో భాగంగా రేపు(శనివారం) మధ్యాహ్నం 1గంటకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మైలవరం బోసు బొమ్మ వద్ద ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థి అక్కల రామమోహనరావు(గాంధీ) ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమానికి సీపీఐ,సీపీఎం మరియు బీఎస్పీ పార్టీల అభిమానులు,కార్యకర్తలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నూజివీడు ప్రచారం అనంతరం మైలవరంలో ప్రచారం ఉంటుందని తదుపరి విజయవాడ వెస్ట్,సెంట్రల్ మరియు ఈస్ట్ నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కృష్ణాజిల్లా ప్రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన, వామపక్షాలు,బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.