తిరువూరు పట్టణంలో గురువారం నాడు రాజకీయ వాతావరణం నామినేషన్లతో సందడిగా మారింది. తెదేపా అభ్యర్థి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ స్థానిక తెదేపా నాయకులు తాళ్లూరి రామారావు, నల్లగట్ల స్వామిదాస్, చెరుకూరి రాజేశ్వరరావు తదితరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు. తిరువూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నుండి వైకాపాలో చేరారు. పొట్లూరి వరప్రసాద్ పార్టీ కండువాా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.