తిరువూరు,గంపలగూడెం,ఎ- కొండూరు ఉపాధ్యాయ సహకార సంఘ ఎన్నికల్లో పిఆర్టియు ప్యానల్ విజయం సాధించింద్. ఆదివారం స్థానిక సహకార భవనంలో పోలింగ్ జరిగింది. మొత్తం 267 ఓట్లకు గాను 264 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 9మంది డైరెక్టర్లు ఉండగా పిఆర్టియు 8, యూటీఎఫ్ 1 స్థానాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత సహకార సంఘ అధ్యక్షుడు కిలారు నగేష్ మరొకసారి తన ప్యానెల్‌ను గెలిపించుకున్నారు.