కోడి పందెలకు బరులు సిద్ధమవుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో, పొలాల్లో భూమిని చదనుచేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు పోలీసులు హెచ్చరికలు సాగుతున్నా.. ఇవి తమకు మామూలేనంటూ పందెగాళ్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పందెం కోసం వినియోగించే బరిని సిద్ధం చేయడంతో పాటు.. అక్కడ గుండాట, పేకాట వంటి జూదాల నిర్వహణకు వేలంపాటలు సాగుతున్నాయి. మద్యం షాపుల ఏర్పాటుకు కూడా మాటలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో జరిగే కోడి పందేల స్థాయిని బట్టి గుండాట, పేకాట నిర్వాహకులను ఎంపిక చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను మించి కృష్ణా జిల్లాలో కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తిరువూరులో స్టేడియం వెనుక భారీగా ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాల వద్ద ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పలువురు బెట్టింగ్ వీరులు ఈ పందేల్లో పెద్ద మొత్తంలో పందేలు కాస్తునారు.
tags:tiruvuru cock fights krishna district sankranthi pongal 2019 cock fights kodipandelu andhra pradesh 2019
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.