వైకాపాలో చేరిన 25మంది రామన్నపాలెం తెదేపా కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ గత నాలుగేళ్ళ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పేర్కొన్నారు. తిరువూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన 25,మంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు సోమవారం వైకాపా కార్యలయంలో ఎమ్మెల్యే రక్షణనిధి సమక్షంలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం నాగనర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.