తిరువూరు పంచాయతీ చరిత్రలో పారిశుద్ధ్య కార్మికులందరూ ఏకమై తొలిసారిగా శానిటరీ ఇన్స్పెక్టర్పై తీవ్రమైన ఆరోపణలతో ప్రభుత్వానికి, ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. గత మూడున్నర సంవత్సరాల నుండి తిరువూరు శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బీ.వీ.సురేష్్కుమార్ వైఖరి వివాదాస్పదంగా ఉంటోంది. తన కింద పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతోనూ, ఇటు పట్టణ ప్రజలతోనూ ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలాసార్లు వివాదాస్పదమైంది. ఏ ఒక్క కమీషనరుతోనూ ఆయన సఖ్యంగా ఉన్నది లేదు. మున్సిపల్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు చెప్పే సమస్యలను ఆయన పరిష్కరించడం లేదు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేత అండతో సురేష్ తిరువూరులో ఎవరినీ ఖాతరు చేయకుండా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపల్ ఛైర్పర్సన్ మరకాల కృష్ణకుమారి పలుమార్లు స్వయంగా ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖామంత్రికి ఈయన్ను బదిలీ చేయమని వినతులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
*** కార్మికుల తిరుగుబాటు
ఇప్పటి వరకు సురేష్ కుమార్ ఆగడాలను భరించిన కార్మికులు ఇక తమవల్ల కాదంటూ ఏకమై మూకుమ్మడిగా ఆయనపైన పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషిస్తున్నాడని, తన ముందు కార్మికులు చెప్పులు వేసుకుని రాకూడదని, కార్మికుల చేత మీరు తప్పు చేశారంటూ గుంజీలు తీయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇతని వైఖరిపై పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయగా క్షమాపణలు కోరి తప్పించుకున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. సురేష్ కుమార్ బారి నుండి తమను కాపాడాలని అతని చర్యలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్‌కు, జిల్లా కలెక్టర్‌కు కార్మికులు వినతి పత్రాలు పంపించారు. ఇతనిపై కార్మికులు చేసిన ఆరోపణల ఫిర్యాదుల పత్రాన్ని ఈ దిగువ పరిశీలించవచ్చు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.