తిరువురు ప్రజలకు సుపరిచితుడు, అందరికీ తలలో నాలుకగా సరదాగా మాట్లాడే స్నేహితుడు, అందరినీ అభిమానంగా పలకరించే ఆత్మీయుడు దాసరి చంద్రశేఖర్ అలియాస్ రాజా అలియాస్ చంటి శుక్రవారం రాత్రి 9గంటలకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. తిరువూరు పోలీసు స్టేషన్ పరిసరాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజా సుపరిచితుడు. ప్రభుత్వాధికారులకు కూడా రాజా ఆత్మీయుడిగా మెలిగేవాడు. మధుమేహంతో బాధపడుతున్న రాజాను బెజవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులు కొంతకాలంగా చికిత్సను అందిస్తున్నారు. శుక్రవారం నాడు అపస్మారక స్థితికి చేరుకున్న అతను ప్రాణాలు విడిచాడు. అతడి మృతి పట్ల తిరువూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం నాడు చంటి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.