నేరం చేసినపుడు అధికార పార్టీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని మిగిలిన పార్టీల వారైతే వెంటనే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల వారు ఆరోపిస్తున్నారు. తిరువూరు మండల తెదేపా అధ్యక్షుడు దొడ్డా లక్ష్మణరావు మరికొందరితో కలిసి కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ బంకా రవీంద్రపై సోమవరం రాత్రి దాడి జరిపి గాయపరిచారు. కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించారని తిరువూరు పోలీసులకు ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. తక్షణమే దొడ్డా లక్ష్మణరావు, తదితరులను అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కూడా చేపట్టారు.