ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరు నియోజకవర్గ పర్యటన ముచ్చటగా మూడు సార్లు వాయిదా పడి నాలుగోసారి ఖరారైంది. గత రెండు వారాల నుండి ఎండలు కాసిన ఈ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం నుండి వర్షాలు పడటం ప్రారంభమయ్యాయి. తిరువూరు, విస్సన్నపేటలో సాయంత్రం ఆరు గంటల వరకు వర్షం పడుతూనే ఉంది.శుక్రవారం నాడు వాతావరణం పొడిగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దాదాపుగా ఖరారైంది. జిల్లా కలెక్టర్ బుధవారం రాత్రి కూడా విస్సన్నపేట లోనే మకాం వేసి ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గ్రామదర్శిని నిర్వహిస్తున్న తాతకుంట్ల గ్రామానికి మహర్దశ పట్టింది. ఆ గ్రామంలో ఉన్న ఒక ప్రముఖ కాంట్రాక్ ర్ గ్రామంలోని ప్రధాన రహదారులు తారు రోడ్లుగా మార్చివేశారు. ముఖ్యమంత్రి పాల్గొనే రచ్చబండలో సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం సాయంత్రనికల్లా తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాలను ప్రత్యేక పోలీసు బలగాలు చేరుకున్నాయి. పోలీసుల హడావుడి అధికంగా ఉంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పది గంటలకు తాతకుంట్ల చేరుకుంటారని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవానికి మద్యాహ్నం ఒంటి గంట తరువాతే చంద్రబాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడు నుండి నాలుగు గంటల సేపు మాత్రమె ఆయన పర్యటన సాగే అవకాశాలు ఉన్నాయి.
**ముఖ్యమంత్రి పర్యటన షెడ్యుల్ ఇది.
*తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు.
*ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటారు.
*గ్రామంలో ఏర్పాటు చేసిన ఫార్మ్ పాండ్ ప్రారంభిస్తారు.
*ఎంపీపీ స్కూల్ సందర్శిస్తారు.
*ఎర్ర చెరువు గట్టుపై మొక్కలు నాటుతారు.
*ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభిస్తారు.
*వర్మీకంపోస్తూ ప్లాంట్ ప్రారంభిస్తారు.
*రచ్చబండ నిర్వహిస్తారు.
*బహిరంగ సభ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.