నిమ్మల జగన్మోహనరావు-వీరరాఘవమ్మల కుమారుడు నిమ్మల శ్రీకుమార్ ఆర్థిక సహకారంతో తిరువూరు మండల గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో 1నుండి5వ తరగతి విద్యనభయ్సిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు 6000 నోటు పుస్తకాలను తిరువూరు పూర్వ విద్యార్థుల సంఘం(తోసా) ఆధ్వర్యంలో అందజేశారు. అక్కపాలెం, మునుకుళ్ల, వావిలాల, వామకుంట్ల, అంజనేయపురం, జి.కొత్తూరు, చౌటపల్లి పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తోసా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోసా ప్రతినిధులు కలకొండ రవికుమార్, కందుల రవికుమార్, వీరంకి చెన్నకేసవరావు, చెప్పల్లి కృష్ణంజనీయులు, కంభం శ్రీనివాసరావు, బెలకొండ నరసింహారావు, నాళ్లా శ్రవణ్, సాయి రాహుల్, నాళ్లా కాశి తదితరులు పాల్గొన్నారు.