తిరువూరు మున్సిపాల్టీకి రూ. 26 కోట్లు నిధులు మంజూరు.
తిరువూరు పట్టణం అభివృద్ధి కొరకు ఎస్సీ, ఎస్టీ నిధుల నుంచి 25.73 కోట్ల రుపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తు జీవో ఇచ్చిందని ,ఈ నిధులను షెడ్యూల్ కులాల ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ, వీధి లేట్లు , శ్మశాన వాటిక, అభివృద్ధి కోసం వినియోగిస్తామని తిరువూరు నియోజకవర్గం ఇన్చార్జి నల్లగట్ల స్వామి దాసు బుధవారం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. రూ.26.73 కోట్లు నిధులు ను తిరువూరు పట్టణం అభివృద్ధి కొసం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ కి, మంత్రి నారాయణకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సి, ఎస్టీ కమిషన్ సభ్యురాలు సుధారాణి, తాళ్లూరి రామారావు , మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.