తిరువూరు మున్సిపాల్టీలో అధికార పార్టీ నాయకుల అవినీతి అక్రమాలకూ అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆ పార్టీ కార్యకర్తల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపాల్టీలో జరుగుతున్న అవకతవకలపై ప్రజలు ఏవగించుకుంటున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు, నేతలు తమ దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతినిత్యం ప్రధాన దినపత్రికల్లో అవినీతి కంపు గురించి ఎంతో సొంపుగా పెద్దఎత్తున వార్తలు వెలువడుతున్నప్పటికి దేశం నేతలు తమ దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తిరువూరు పట్టణంలో పైపులైను మరమత్తు పనులు రూ.40లక్షలు మంజూరు అయ్యాయి. ఈ మరమత్తుల నిధులను రాజుపేట నుండి కొకిలంపాడు వరకు కొత్త పైపులైను వేయటానికి దారి మళ్లించారని ప్రతిపక్ష కౌన్సిలర్లు, ఎమ్మెల్యే రక్షణనిధి ఆరోపిస్తున్నారు. కొత్తగా బోర్ వెల్, మోటార్లు వేయకుండానే నూతన పైపులైను వేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పైపులైను నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని మున్సిపల్ ఏఈ తన బాధ్యతలను విస్మరించి ముడుపులు తీసుకుని అధికార పార్టీ నేతలకు అడ్డగోలుగా సహకరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. తిరువూరు మున్సిపాల్టీకి పట్టణ ప్రజలు వివిధ పన్నుల మీద చెల్లిస్తున్న కోట్లాది రూపాయలూ దుర్వినియోగం అవుతున్నాయనీ ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
tags: tiruvuru news tvrnews tvrnews.com tiruvuru kaburlu tiruvuru telugudesam party corruption tdp corruption 2018 tiruvuru krishna district political leaders corruption rakshana nidhi ysrcp mla
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.