అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ న్యాయవాది, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అద్యక్షుడు సువారపు రామచంద్రరావు భౌతికకాయానికి సోమవారం సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశృనయనాల నడుమ అంత్యక్రియలు జరిగాయి. కేడీసీసీ బ్యాంక్ వీధిలోని ఆయన స్వగృహం నుంచి మునుకుళ్ల రహదారిలోని స్వర్గపూరి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతకు ముందు ఎక్సైజ్ శాఖా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, మార్క్ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు, ఏఎంసి మాజీ చైర్మన్ తాళ్ళూరి రామారావు, నాయకులు కొతపల్లి ఆనంద్ స్వరూప్, వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, అఖిల భారత లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చలసాని అజయ్ కుమార్, సీపీఐ నాయకులు తూము కృష్ణయ్య, పసుపులేటి వెంకయ్య, కొత్తపల్లి సుందరరావు, సి.హెచ్.వెంకటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు సువారపు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపం తెలిపారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.