తిరువూరు మున్సిపాల్టీగా ఏర్పడి నాలుగేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా మున్సిపాల్టీ అనేక విషయాల్లో రాష్ట్ర స్థాయిలోనే రికార్డు నెలకొల్పింది. కుంభకోణాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అధికార వర్గంలోనే కుమ్ములాటలు, ప్రతిపక్షం వైకాపా పైచేయి తదితర విషయాల్లో తిరువూరు మున్సిపాల్టీ రాష్ట్ర స్థాయిలోనే పలురికార్డులను నెలకొల్పింది. దీంతో పాటు 20లక్షల రూపాయల పింఛన్ల కుంభకోణం జరిగి నలుగురు ఉద్యోగులు ఒకేసారి సస్పెండ్ అవడం కూడా ఈ మున్సిపాల్టీ నెలకొల్పిన రికార్డు. తాజాగా తిరువూరు ముల్సిపాల్టీ మరొక సరికొత్త రికార్డును సృష్టించింది. గురువారం నాడు నాలుగో కృష్ణుడు ఈ మున్సిపాల్టీలో రంగప్రవేశం చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు కమీషనర్లు ముచ్చటగా బాధ్యతలు నిర్వహించగా…నాలుగో కమీషనర్‌గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇదొక రికార్డు. రానున్న సంవత్సరం కాలంలో ఈ మున్సిపాల్టీలో మరిన్ని రికార్డులు ఏర్పడతాయని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.