Photo: Ayesha
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్ధులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సంపాదించారు. మరోసారి మన జిల్లా విద్యార్ధులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లో తిరువూరు బాలికలు కూడా అగ్రస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తిరువూరు నాగార్జున కళాశాలా విద్యార్థిని బైపీసీలో 990 మార్కులు సంపాదించి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని పొందింది. స్థానిక శ్రీనిధి కళాశాల విద్యార్ధిని కొత్తగుండ్ల సాయిశ్రీ జోష్న 984మార్కులు సంపాదించి మన డివిజన్లో ప్రథమ స్థానంలో నిలిచింది. 983 మార్కులతో దారా మనోజ్ఞ, 982 సి.హెచ్.మౌనిక, 980మార్కులతో వీ.రిషిత 979మార్కులతో జీ. విజయశ్రీ తమ సత్తా చాటారు. జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన తిరువూరు అమ్మాయిలను ప్రత్యేకంగా అభినందించారు.