తిరువూరు ప్రాంత క్రీడాకారులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సౌకర్యాలు సమకూరడం లేదు.తిరువూరు – కొకిలంపాడు రహదారిలో స్టేడియం కోసం ఐదేకరాల స్థలాన్ని దాతలు విరాళంగా ఇచ్చిన 25ఏళ్ల తరువాత ఇక్కడ ఎట్టకేలకు స్టేడియం నిర్మించారు. దీనిలో విశాలమైన భవనాలు తప్ప క్రీడాకారులకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) విఫలం చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఇండోర్ స్టేడియం లో షటిల్ కోర్టు ఒక్కటే ఉంది. దీంట్లో కూడా అరకొర సౌకర్యాలే ఉన్నాయి. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలు నాసిరకంగా ఉన్నాయి. జిమ్ ను ప్రారంభించి నెలరోజులు అవుతున్నప్పటికీ వాటిలో సగం పరికరాలు పనిచేయడం లేదు. శాప్ ఆద్వర్యంలో నియమించిన కోచ్(శిక్షకుడు) క్రీడాకారులకు అందుబాటులో ఉండటం లేదు.
*** అధికంగా ఫీజు
ఇక్కడ షటిల్ కోర్టులో క్రీడాకారుల నుండి దిమ్మ తిరిగే ఫీజులు వసూలు చేస్తున్నారు.సభ్యత్వం కింద రూ. 5000 నిర్ణయించడంతో చాలా మంది షటిల్ క్రీడాకారులు ఫీజు చెల్లించలేక వెనుకకు తగ్గారు. షటిల్ క్రీడాకారులకు నెలవారిగా రూ.500 ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది కూడా చాలా ఎక్కువని క్రీడాకారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. రాత్రి సమయంలో ఈ క్రీడా ప్రాంగణంలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. భవనాల్లో తప్ప బయట ఆవరణలో ఎక్కడా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రాంగణం అంతా చీకటి మయంగా ఉంటుంది. రాత్రి పూట స్టేడియం కి వెళ్ళాలంటే క్రీడాకారులు భయపడుతున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. స్టేడియం ఏర్పాటు చేసినా చాలా గదులు నిరుపయోగంగా ఉన్నాయి. మంచి నీటి సౌకర్యం . విద్యుత్ మోటార్ పనిచేయడంలేదు. క్రీడా శాఖా మంత్రి కోల్లు రవీంద్ర తో ఈ ప్రాంత అధికార పార్టీ నాయకులకు మంచి సంబందాలు ఉన్నాయి. ఒక్క నాయకుడు కూడా స్టేడియంకు కావలసిన సౌకర్యాల గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్ల లేకపోయారు. ఈ వేసవి కాలంలో సెలవు రోజులలో బాలబాలికలు ఆడుకునే విధంగా వివిధ క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాలనీ తల్లిదండ్రులు కోరుతున్నారు. విశాలమైన ఈ క్రీడా ప్రాంగణంలో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు. ఈతకొలను ఏర్పాటు చేయటానికి కూడా కావలసినంత స్థలం ఇక్కడ ఉంది. మహిళా క్రీడాకారులకు కూడా ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికైనా కేవలం సంపాదన పైనే దృష్టి పెట్టిన తిరువూరు ప్రాంత అధికార పార్టీ నాయకులు స్టేడియంలో సౌకర్యాల పై శ్రద్ద పెట్టాలని జిల్లాకు చెందిన క్రీడాశాఖా మంత్రి కోల్లు రవీంద్ర తిరువూరు స్టేడియంపై దృష్టి పెట్టాలని ఈ ప్రాంత క్రీడాకారులు కోరుతున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.