తిరువూరు ఆర్టీసీ బస్ డిపోలో నెలకొని ఉన్న అధ్వాన పరిస్టితుల గురించి TVRNEWS.COMలో గురువారం నాడు ఇచ్చిన వార్తకు తిరువూరు ప్రాంత ప్రజల నుండి మంచి స్పందన లభించింది. FACEBOOKలో దీనిని ఇప్పటి వరకు 5వేల మందికి పైగా చదివారు. తమ స్పందనను తెలియజేశారు. WhatsAppలో కూడా కొంతమంది స్పందించారు. తిరువూరు ఆర్టీసీ బస్ డిపో నుండి మరికొన్ని సర్వీసులను నడపాలని, ఇంకొన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రక్షణనిధి, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి స్వామిదాస్లను ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని సర్వీసులు గురించి ప్రయాణీకులు కోరుతున్నారు.
* తిరువూరు నుండి నాగాయలంక పునరుద్ధరించాలి.
* గతంలో జిల్లాలోనే అత్యంత దూరం నడిచే పల్లెవెలుగు సర్వీసుగా గుర్తింపు పొందిన తిరువూరు నుండి వయా ఎ.కొండూరు, రేపూడి, తూర్పుమాధవరం మీదుగా మచిలీపట్నం వెళ్ళే పాసింజరు సర్వీసును పునరుద్దరించాలి.
* తిరువూరు నుండి వయా నూజివీడు మీదుగా విజయవాడ గతంలో నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మంచి ఆదరణ లభించింది. ఈ సర్వీసులను పునరుద్దరించాలి.
* విజయవాడ నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రతి అరగంటకు తిరువూరు వచ్చే విధంగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడపాలి.
* విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే ఎక్స్‌ప్రెస్ సర్వీసులను మైలవరంలో మాత్రమే ఆగుతున్నాయి. మరికొన్ని నాన్‌స్టాప్‌గా తిరువూరు వస్తున్నాయి. తిరువూరు బస్సులు కూడా ఇదే విధంగా నడపాలి. ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ అన్ని గ్రామాల్లో ఆపే పద్దతికి స్వస్తి చెప్పాలి.
* తిరువూరు డిపో నుంచి నడిచే బస్సు సర్వీసులన్నీ అద్వానంగా ఉంటున్నాయి. శుభ్రత పాటించడంలేదు. సూపర్ లగ్జరీల సైతం కంపు కొడుతున్నాయి.
* తక్షణమే ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి తిరువూరు ఆర్టీసీ బస్ డిపో నుండి ప్రయాణీకులు కోరుతున్న సర్వీసులను ప్రారంభించాలని కోరుతున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.