తిరువూరు నగర పంచాయతిలో జరిగిన ఫించన్ల కుంభకోణంలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లదిఅనత్లు సమాచారం. ఇప్పటికే ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసారు. దీనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసారు. పరమేష్, సురేష్, డీ.వెంకటేశ్వరరావు, ఎం.మురళి లు సస్పెండ్ చేయటంతో పాటు వారిపై సోమవారం నాడు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసారు.గతంలో మున్సిపల్ కమీషనర్ లుగా పని చేసిన మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, మల్లిఖార్జునరావులకు కూడా ఈ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వీరిలో ఇరువురు కమీషన్లకు పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నూజివీడు ఆర్డీవో రంగయ్యతో పాటు విజిలెన్స్ విచారణ కూడా వేగవంతం చేసినట్లు సంచారం. కాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం మున్సిపల్ కమీషనర్ రఘుకుమార్ మంగళవారం నాడు ఈ కుంభకోణానికి సంబందించిన పత్రాలు తీసుకుని మచిలీపట్నం వెళ్ళినట్లు సమాచారం.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.