కేంద్ర బడ్జెట్లో ఏపీకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు తిరువూరు మండలంలో విజయవంతమయింది. కమ్యూనిస్ట్, వైకాపా, కాంగ్రెస్ శ్రేణులు ఉదయం నుండే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బంద్‌ను ప్రారంభించారు. తిరువూరు, గంపలగూడేం, ఏ.కొండూరు, విస్సన్నపేట మండలాల్లో విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపర సంస్థలు మూతపడ్డాయి.