సాంప్రదాయ కోడిపందేల ముసుగులో సంక్రాంతి పండుగ రోజున జూదం విచ్చలవిడిగా సాగింది. అధిక ధరలకు మద్య విక్రయాలు ఏరులై పారాయి. కోడిపందేలతో పాటు జూదంలోనూ ఒక తిరువూరు నియోజకవర్గంలోనే కోట్లాది రూపాయిలకు పైగా సామాన్య ప్రజలు తమ జేబులను ఖాళీ చేసుకున్నారు. తిరువూరు, కాకర్ల, ముష్టికుంట్ల, ఊటుకూరు, గుళ్లపూడి, వేమిరెడ్డిపల్లి, జనార్థనవరం, పుట్రేల తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కోడిపందేల పేరుతో జూదాలను నిర్వహించారు. పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా నుండి సైతం పెద్దసంఖ్యలో పందెంరాయుళ్లు, జూదగాళ్లు ఈ ప్రాంతానికి తరలివచ్చారు.