డిసెంబరు 5వ తేదీన అమెరికా వెళ్లిన తిరువూరు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్, సుధారాణి దంపతులు కొద్ది గంటల క్రితమే అమెరికా నుండి బయలుదేరారు. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయికు బయల్దేరారు. నేటి అర్ధరాత్రికి దుబాయి చేరుకుని అక్కడి నుండి ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు, అటు నుండి నేరుగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తిరువూరుకు వస్తారు.
** గత 5వతేదీన డల్లాస్ వెళ్లిన స్వామిదాస్ దంపతులుకు అక్కడి స్థానిక కృష్ణాజిల్లా ప్రవాసులు అభినందన సభ ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తమ కుమారుడు క్రాంతిభూషణ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో స్వామిదాస్, సుధారాణిలు పాల్గొన్నారు. తరువాత న్యూజెర్సీ. న్యూయార్క్‌లలో పర్యటించారు. న్యూజెర్సీ రాష్ట్ర మంత్రి చివుకుల ఉపేంద్రతో భేటి అయ్యారు. వాషింగ్టన్ డీసీలో పర్యటన సందర్భంగా తానా అధ్యక్షుడు వేమన సతీష్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు స్వామిదాస్ ను సత్కరించారు. ఆక్కడి నుండి లాస్ వేగాస్, లాస్ ఏంజెల్స్, డెత్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో విహారయాత్ర గడిపి మూడురోజుల క్రితం శాన్ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. గొల్లపూడికి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కేతినేని కిషోర్‌బాబు శాన్ఫ్రాన్సిస్కో నగరంలో పర్యటన ప్రాంతాలను చూపించారు. గత గురువారం నాడు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమెరికా తొలి తెలుగు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. శుక్రవారం రాత్రి ఉత్తర అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం స్వామిదాస్, సుధారాణిల అభినందన సభ, విందును స్వాగత్ హోటల్లో ఏర్పాటు చేశారు. తమ అమెరికా పర్యటన సంతోషకరంగా సాగిందని మంచి అనుభూతులుతో తిరువూరుకు తరలివస్తున్నామని కొద్దిసేపటి క్రితం విమానం ఎక్కే ముందు స్వామిదాస్ దంపతులు TVRNEWS.COMకు తెలిపారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.