అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నాడు కృష్ణాజిల్లా తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ‘విద్యార్ధుల చైతన్య సదస్సు’ నిర్వహించారు. న్యూయార్క్ ఫ్యాషన్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్టార్ డా.వంగపాటి రాజశేఖర్ రెడ్డి విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలోను, భారత్ లోను ఉన్న ఇంజనీరింగ్ బోధనా విధానాల మధ్య ఉన్న తేడాల గురించి, అమెరికాలో ఉన్నత విద్యావకాశాల గురించి ప్రొఫెసర్ రాజశేఖర్ వివరించారు. ప్రతి విద్యార్ధి తనకంటూ తప్పనిసరిగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కష్టపడి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు గతంలో ధనవంతులు పిల్లలే వచ్చేవారని ప్రస్తుతం బాగా చదువుకుంటున్న గ్రామీణ విద్యార్ధులు సైతం ఈ దేశాలకు ఉన్నత చదువులు కోసం ఎక్కువగా వెళ్తున్నారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ TNILIVE.COM నిర్వాహకుడు కిలారు ముద్దుకృష్ణ సభకు అధ్యక్షత వహించారు. కళాశాల చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరు సుబ్రహ్మణ్యం, కరస్పాండెంట్ పోట్రు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా.రంగా నాగేంద్రబాబు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ రాజశేఖర్‌ను పాలకవర్గ సభ్యులు సత్కరించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.