తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. గత రెండు సంవత్సరాల నుండి తాళ్లూరి రామారావు చైర్మన్ గా ఉన్నారు. పాలకవర్గం పదవీ కాలం గత 18వ తేదీతో ముగిసింది. తదుపరి పాలకవర్గాన్ని నూతనంగా నియమించాల్సి ఉంది. తాళ్లూరి రామారావు మరలా చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తెదేపా సినియర్ నేతలు కుడా ఈ పదవి కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.