మాజీ శాసనసభ్యుడు తిరువూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ డిసెంబర్ 5 నుండి 30వ తేదీ వరకు భార్య సుధారాణితో కలిసి అమెరికా వెళ్తున్నారు. స్వామిదాస్ దంపతులకు బుధవారం నాడు అమెరికా వీసా మంజూరు అయింది. స్వామిదాస్ కుమారుడు క్రాంతికుమార్ ఎం.ఎస్ పూర్తి అయిన సందర్భంగా పట్టా తీసుకుంటున్నాడు. ఆర్కాన్సా విశ్వవిద్యాలయంలో డిసెంబరు 8వ తేదీన జరిగే పట్టా ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వాషింగ్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, నయాగరా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో స్వామిదాస్-సుధారాణిలు పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లో తిరువురుకు చెందిన ప్రవాసులను వీరు కలుసుకుంటారు.