గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో 15, 21 ఏళ్లు కలిగిన ఇరువురు మానసిక వికలాంగురాళ్లపై అదే గ్రామానికి చెందిన గొర్రిముచ్చు గోపి(27) ఇంట్లో ఎవరి లేని సమయంలో ఒకరి తర్వాత మరొకరిపై అత్యాచారానికి పాల్పడినట్లు నూజివీడు డీ.ఎస్.పీ. వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గోపీ పక్కన ఇంటిలోనే ఈ ఇరువురు బాలికలు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగిందని, కూలీ పనుల నుండి తిరిగొచ్చిన తల్లిదండ్రులు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.