ముస్లిం మైనారిటీల సంక్షేమమే తెదేపా లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయము కూడా అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. తిరువూరు పట్టణంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నాని ప్రారంభించారు. అనంతరం మైనారిటీ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమంలో కేశినేని ప్రసంగించారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కొరకు అనేకానేక పథకాలు చేపడుతుందని అన్నారు. దుల్హన్,దుకాన్-ఏ-మకాన్, రంజాన్ తోఫా,సబ్సిడీ రుణాలు లాంటి అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నెలకు10,వేల రూపాయలు సంపాదించాలనేదే ప్రభుత్వం లక్ష్యమని తెలుపుతూ తమ నైపుణ్యత ద్వారా అనేకానేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 265,గ్రామాల్లో టాటా ట్రస్ట్ ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు వైద్య సహాయం ద్వారా చికిత్సలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ఎంపీ గా నాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు స్వామిదాస్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి, తిరువూరు మున్సిపల్ కమిషనర్ మరకాల కృష్ణకుమారి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తాళ్లూరి రామారావు, కృష్ణకుమారి,ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు,శ్వ్ నరసింహారావు, జడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందు,కౌన్సిల్లర్లు ఎన్ లక్ష్మీ,కో-ఆప్షన్ సభ్యులు కరీం,పట్టణ పార్టీ అద్యక్షులు బొమ్మసాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.