తోటమూల-చీమలపాడు రహదారికి మంత్రి ఉమా శంఖుస్థాపన-చిత్రాలు
గంపలగూడెం మండలం తోటమూల నుండి నారికింపాడు మీదుగా ఎ.కొండూరు మండలం చీమలపాడుకు వెళ్లే రహదారి అభివృద్ధి పనులకు జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా బుధవారం నాడు శంఖుస్థాపన చేశారు. 18కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి పనులకు రూ.17కోట్లతో మరమత్తులు చేయనున్నారు. కార్యక్రమంలో ఎంపీ నాని, స్థానిక తెదేపా నాయకులు తాళ్లూరి రామారావు, నల్లగట్ల స్వామిదాస్, చెరుకూరి రాజేశ్వరరావు, కిలారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.