తిరువూరు పోలీసులు అమ్ముడుపోతున్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి తీవ్ర వ్యాఖ్యలు.
కృష్ణాజిల్లా తిరువూరులో గంజాయి,డ్రగ్స్ వంటివి సరఫరా అవుతున్న పోలీసులు మౌనం వెనుక అంతర్యం అర్థం కవటంలేదని MLA రక్షణనిధి విమర్శించారు. ఆదివారం రాత్రి తిరువూరు పట్టణంలో కొంతమంది యువకుల చేతిలో కత్తి పోట్లకు గురై తీవ్ర గాయాలు పాలైన సంచి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను MLA రక్షణనిధి పరామర్శించారు. దాడికి వారిని కఠినంగా శిక్షించాలని ఈ కేసు విషయమై జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరిన తిరువూరు పోలీస్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఒక సర్పంచ్ భర్త కూడా హత్యకు గురయ్యాడని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని MLA కోరారు. తిరువూరు పోలీస్ అధికారులు డబ్బులు తీసుకుని ఎలాంటి కేసులనైన నీరుగార్చే యత్నం చేస్తున్నారని ఇలాంటి పద్ధతులు సరికావని హెచ్చరించారు.