తిరువూరులో అరుదైన కదంబం పుష్పాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏడాది శ్రావణ మాసంలోనే ఈ పుష్పాలు దర్శనమిస్తాయి. కదంబం చెట్లు అరుదుగానే కనిపిస్తాయి. వీటికి పూసే పుష్పాలు కనకదుర్గకు, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవిగా పురాణాలు చెప్తున్నాయి. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ దారిలో కిలారు ముద్దుకృష్ణ నివాసం ఎదురుగా ఉన్న ఈ కదంబం చెట్టు ఈ ఏడాది విరబూసి చూపరులను అలరిస్తోంది.