తిరువూరులోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1983-84 మధ్యకాలంలో విద్యనభ్యసించిన విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు స్థానిక వాహినీ కళాశాలలో నిర్వహించారు. 35సంవత్సరాల అనంతరం కలిసి చదువుకున్న స్నేహితురాళ్లను చూసుకుని, ఆత్మీయంగా పలకరించుకుని వీరంతా మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం తాము చదువుకున్న పాఠశాలకు వెళ్లి గత స్మృతులను నెమరవెసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పొట్లూరి శాంతి తదితరులు సమన్వయపరిచారు.