తిరువూరులో ఇప్పటి వరకు మందు బాబులు మహా ఇబ్బంది పడుతున్నారు. ఉభయ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న తిరువూరులో మద్యం వ్యాపారం ప్రతిరోజూ లక్షలాది రూపాయాల మేర జరుగుతుంది. తిరువూరులో ఉన్న 5 మద్యం దుకాణాలు ప్రతినిత్యం మందు బాబులతో కిటకిటలాడుతుంటాయి. బైపాస్ రోడ్డులో ఉన్న చాలా హోటళ్ళలో మద్యాన్ని రాత్రింబవళ్ళు బహిరంగంగానూ, భారీగానూ విక్రయిస్తున్నారు. ఇటు మద్యం దుకాణాల్లోనూ, అటు హోటళ్లలోనూ మద్యాన్ని ఎమ్మార్పీ ధరల కన్నా చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు మందు బాబులు గగ్గోలుపెడుతున్నారు. గత కొద్ది సంవత్సరాల నుండి తిరువూరులో ఉన్న మద్యపాన ప్రియులు కొందరు సంఘంగా ఏర్పడి మద్యం దుకాణాల యజమానులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏ విధమైన ప్రయోజనం లేకపోయిఒది. దుకాణం యజమానులు ఇచ్చే మామూళ్ళకు అలవాటుపడి ఎక్సైజ్ అధికారులు దుకాణం యజమానులకు బహుబాగా సహకరించారు.
*** మావోడు వచ్చాడు జాగ్రత్త!!!!
ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జవహర్ తిరువూరు ప్రాంతం వాడే. జవహర్ నియామకం కన్నా….ఆయనకు కేటాయిఒచిన శాఖ పట్ల తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మందుబాబులు మహదానందపడిపోతున్నారు. ఇక నుండి మద్యం బాటిళ్ళపై ఉన్న ఎమ్మార్పీ ధరకే విక్రయిఒచాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. వీరంతా మంత్రి ఫోన్ నెంబర్ జేబులో పెట్టుకుని మద్యం దుకాణం యజమానులను బెదిరిస్తున్నారు. ఒక 10 రోజుల్లో కొత్త మద్యం దుకాణాలు వస్తున్నాయి. ఈ దుకాణం యజమానులు కూడా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయిఒచవలసి ఉంటుంది. లేని పక్షంలో మందుబాబుల ఆగ్రహానికి, మంత్రి చేపట్టబోయే చట్టపర చర్యలకు దుకాణం యజమానులు, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారు గురికావాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త! మందుబాబులు జిందాబాద్…
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.