దాదాపు 35 సం.ల నుండి ఆదాయపు పన్ను శాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు(పి.వి.రావు) శుక్రవారం నాడు చీఫ్ కమీషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆదాయపు పన్ను శాఖ ఆడిటోరియంలో పి.వి.రావుకు అ శాఖ తరుపున వీడ్కోలు, అభినందన సభ నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. పి.వి.రావు తన పదవీకాలంలో సాధించిన విజయాలను ఆ శాఖకు అందించిన సేవలను పలువురు కొనియాడారు. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన పి.వి.రావు దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు. పి.వి.రావు బాల్యమిత్రుడు తిరువూరుకు చెందిన కిలారు ముద్దుకృష్ణ, తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి భర్త, బెంగళూరు ఆదాయపు పన్ను శాఖ కమీషనర్ దిరిశం సుధాకరరావులు తిరువూరు ప్రాంత ప్రజల తరుపున వెంకటేశ్వరరావుకు అభినందనలు అందజేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.