తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఇరువురు వ్యక్తులు మధ్య పోటి తీవ్రంగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో….గతంలో పట్టణ అధ్యక్షునిగా పనిచేసిన బొమ్మసాని ఉమామహేష్, పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బొబ్బా జయకుమార్‌ల మధ్య పోటీ ఏర్పడింది. ఉభయ వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో పరిశీలకులు ఫలితాన్ని వాయిదా వేశారు. సీల్డుకవరులో తమ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. తిరువూరు పట్టణ దేశం రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న బొబ్బా కుమార్‌కు అనుకూలంగా తిరువూరు నియోజకవర్గ దేశం పార్టీ కన్వినర్ ఎన్.స్వామిదాస్ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. మహేష్‌కు మద్దతుగా మార్కెట్ కమిటి అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు గట్టిగా నిలబడ్డారు. మహేష్ ఇప్పటికే ఒకసారి ఈ పదవిని నిర్వహించినందున ఈ పర్యాయం బొబ్బా కుమార్(బాల్‌ఠాక్రే)కు పట్టణ దేశం అధ్యక్ష పదవిని ఇవ్వాలని మరొక వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇరువర్గాల వారు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పైస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.