ముస్లిం మైనారిటిలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా ఉందని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ అన్నారు. గతంలో నిర్మించిన పట్టణంలోని “షాదిఖానా” 13 లక్షల రూపాయల నిధులతో మరమ్మత్తులల అనంతరం సోమవారం పున: ప్రారంభం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎమ్మెల్సీ షరీఫ్‌లతో కలిసి ఎంపి నాని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాం చేశారు. అనంతరం స్థానిక AMC కార్యాలయంలో తిరువూరు పట్టణ ప్రజలకు స్థానిక నాయకులు బొమ్మసాని మహేష్, యండ్రాతి కిరణ్‌కుమార్‌లు అందించిన మంచినీటి వాటర్ ట్యాఒక్స్ ఎంపి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి, NSP ప్రాజెక్ట్ కమిటి చైర్మెన్ వై. పుల్లయ్య చౌదరి, TVR మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్, AMC చైర్మెన్ తాళ్ళూరి రామారావు, నగర పంచాయితి చైర్ పర్సన్ ఎం.కృష్ణకుమారి, జడ్పిటిసి సభ్యురాలు కిలారు విజయ బిందు తదితరులు పాల్గొన్నారు.