మంత్రి జవహర్‌తో సమావేశమైన తిరువూరు ప్రాంత తెదేపా నాయకులు
ఎక్సైజ్ శాఖా మంత్రి తిరువూరు మండలం గానుగపాడుకు చెందిన కొవ్వూరు శాసనసభ్యుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ బుధవారం నాడు తిరువూరు ప్రాంత తెదేపా నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. తిరువూరు మండలంలో పార్టీ బలోపేతానికి ఆచరించవల్సిన భవిష్యత్ కార్యాచరణపై వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం. మంత్రిని కలిసిన వారిలో రోలుపడి సర్పంచ్ కిలారు రమేష్, గద్దే రమణ తదితరులు ఉన్నారు. నేడు ఆయన ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అభినందనలు తెలిపారు. జవహర్ మాట్లాడుతూ…ఎస్ఐ స్థాయి వరకు సిమ్ కార్డ్స్ ఇచ్చే ఫైల్‌పై రెండో సంతకం చేశారు. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే భారీగా జరిమానా విధిస్తామని, జిల్లాలో డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.