తిరువూరు మండలం, గానుగపాడుకు చెందిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానాన్ని అలఒకరించారు. ఆయనకు ప్రాధాన్యత కలిగిన ఎక్సైజ్ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. జవహర్ కొవ్వూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికి ఆయన తిరువూరు ప్రాంత వ్యక్తిగానే స్థానిక ప్రజలు భావిస్తుంటారు. ఆయన బంధువర్గం అంతా ఇక్కడే ఉండటంతో ఆయన తరచుగా తిరువూరుకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. 1989లో జవహర్ అన్న కొత్తపల్లి రవీంద్రనాథ్‌కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరువూరు నుండి పోటీ చేయడానికి టికెట్‌ను కేటాయిఒచారు. అప్పటి హోం శాఖామంత్రి కాంగ్రెస్ అభ్యర్ది కోనేరు రంగారావుపై రవీంద్రనాథ్ కేవలం 1800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రవీంద్ర ఎన్నికల విజయం కోసం నియోజకవర్గం అంతా పర్యటించిన జవహర్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉంటున్నారు. ఉపాధ్యాయుడుగా ఉద్యోగం కొరకు కొవ్వూరు వెళ్ళిన జవహర్ స్థానికంగా పార్టీ నేతలకు దగ్గరగా ఉంటూ మంచి అభిమానిగా గుర్తింపు పొందారు. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టి జవహర్ కు అభ్యర్దిత్వం ఇచ్చింది. మంచి మనిషిగా మంచి వ్యక్తిత్వం ఉన్న వాడిగా పేరు పొందిన జవహర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడ్డారు. హేమాహేమిలను పక్కన పెట్టి జవహర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు కీలకమైన ఎక్సైజ్ శాఖ ను అప్పగించారు. నాడు అన్న రవీంద్రనాథ్ సాధించలేనిది నేడు జవహర్ పట్టుపట్టి సాధించడం అభినందనీయం. తిరువూరు నియోజకవర్గ ప్రజలు జవహర్ కు కీలక పదవి లభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు అందజేస్తున్నారు. త్వరలో తిరువురులో జవహర్ కు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన అభిమానులు, సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.