తిరువూరు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశాన్ని సోమవారం నాడు కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. ఈ వేసవిలో నిటి ఎద్దడి నివారణకు తీసుకోవలసిన చర్యలను గురించి సమావేశంలో చర్చించారు. చైర్పర్సన్ మరకాల కృష్ణకుమారి అధ్యక్షత వహించారు. వేసవి కాలం వచ్చినప్పటికీ తిరువూరు ప్రజలకు మంచి నీటిని అందించే విషయంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విషయంలో పాలక పక్షం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.