తీర్థయాత్రకు వెళ్ళిన గంపలగూడెం వ్యాపారి చారుగుండ్ల వెంకటేశ్వరరావు (67) నేపాల్ కు సమీపంలోని ముక్తినాథ్ వద్ద మృతి చెందారు. శుక్రవారం రాత్రి మృతి చెందగా వాతావరణం సహకరించక మృతదేహాన్ని స్వస్థలమైన గంపలగూడెం తీసుకురావడంలో ఆలస్యమైంది. విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో వెంకటేశ్వరరావు మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా గంపలగూడెం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని పెద్ద కుమారుడు ప్రసాద్ మైలవరం మార్కెట్ కమిటి డైరక్టరుగా ఉన్నారు.