తిరువూరు సాయిబాబా గుడి వీధిలో నూనె వ్యాపారం చేసే ఓ వ్యాపార సంస్థపై ఆదాయ పన్ను శాఖాధికారులు శుక్రవారం నాడు దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన ఒక వ్యాపారస్థుడు తిరువూరులో నూనె వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల పాతనోట్ల రద్దు సందర్భంగా ఈ వ్యాపార సంస్థ పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు కృష్ణ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా నిర్వహించినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న ఖమ్మంకు చెందిన ఆదాయ పన్ను శాఖాధికారులు తిరువూరులోని ఆ వ్యాపార సంస్థపై ఉదయం నుండి దాడులు జరిపి ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ వ్యాపారస్థుడికి ఉన్న ఇతర ఆస్తుల లావాదేవీల పైన కూడా తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం.