తిరువూరు పట్టణంలో స్థానిక చీరాల సెంటర్ సమీపంలో 50 లక్షల వ్యయఒతో నిర్మించిన తారక రామ రైతుబజార్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. ఎంపి కేశినేని నాని, స్థానిక ఏమ్మేల్యే కె.రక్షణనిధి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ కంచి రామారావు, తిరువూరు మార్కెట్ కమిటి అధ్యక్షుడు తాళ్ళూరి రామారావుతో పాటు మార్కెటింగ్ శాఖకు చెందిన ఉన్నత అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.