తిరువూరు ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటిలో భారీ కుంభకోణం. విచారణకు కలెక్టర్ ఆదేశం.
తిరువూరు ఎన్.ఎస్.పీ. ప్రాజెక్టులో ఉద్యోగుల కోసం కేటాయిఒచిన ప్రభుత్వ భూమి కేటాయిఒపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో జిల్లా కలెక్టర్ హెచ్.కె.బాబు విచారణకు ఆదేశించారు.ఈ హౌసింగ్ సొసైటిలో ప్లాట్లు కేటాయిఒచిన ఉద్యోగుల నుండి రిజిస్ట్రేషన్ పేరుతో లక్షలాది రూపాయలు నిర్భందంగా వసూలు చేస్తున్నారని మొదట్లో కేటాయిఒచిన లబ్దిదారుల జాబితాను తారుమారు చేశారని ఎన్.ఎస్.పీలో ఉద్యోగుల సంఘానికి కేటాయిఒచిన భూమి కన్నా అదనంగా మరికొంత భూమిని ఆక్రమించి బయట వరకు అమ్ముకుంటున్నారని కలెక్టర్కు ఫిర్యాదు అందింది. దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని జిల్లా రెవిన్యూ అధికారికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.